WILL SENSATIONAL SRI REDDY GETTING MARRIED AND WHAT IS THE GOOD NEWS SHE WAS TALKING ABOUT IN TWITTER PK
Sri Reddy: శ్రీ రెడ్డి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పెళ్లి చేసుకోబోతుందా ఏంటి..?
శ్రీ రెడ్డి (Sri Reddy/Twitter)
Sri Reddy: శ్రీ రెడ్డి.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. వివాదం ఉంటే ఓకే లేకపోతే తానే వెళ్లి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. అంత పాపులర్ అయింది కొన్ని రోజుల్లోనే. ఒకప్పుడు యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి..
శ్రీ రెడ్డి.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. వివాదం ఉంటే ఓకే లేకపోతే తానే వెళ్లి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. అంత పాపులర్ అయింది కొన్ని రోజుల్లోనే. ఒకప్పుడు యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు కేరాఫ్ సెన్సేషన్‌గా మారిపోయింది శ్రీ రెడ్డి. ఇప్పటికీ ఈమె పేరు చెప్తే చాలు సోషల్ మీడియా షేక్ అవుతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరిపై నోరేసుకుని పడిపోతుంది శ్రీ రెడ్డి. అందుకే అందరు హీరోల ఫ్యాన్స్ కూడా ఈమెపై కోపంతో ఊగిపోతుంటారు. కొందరు అయితే చాలా మర్యాదగా దొరికితే చంపేస్తాం అంటూ వార్నింగులు కూడా ఇస్తుంటారు. మరోవైపు శ్రీ రెడ్డి మాత్రం ఇవన్నీ నా చిన్నపుడే చూసాను.. మీరు నన్ను భయపెట్టల్లేర్రా అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తుంటుంది. ఎప్పుడూ వార్నింగులు, అరవడాలు తప్ప మరోటి లేని శ్రీ రెడ్డి నుంచి ఇప్పుడు గుడ్ న్యూస్ అనే మాట వినిపించింది. త్వరలోనే తన నుంచి సర్ప్రైజ్ ఉండబోతుందని.. తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని ట్వీట్ చేసింది శ్రీ రెడ్డి. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కింద కామెంట్స్ పుట్టలు పుట్టలుగా వస్తున్నాయి. ఏం చెప్పబోతున్నారు శ్రీ రెడ్డి గారు అంటూ కొందరు మర్యాదగా అడుగుతుంటే.. ఇంకేముంది మళ్లీ ఏదో టార్గెట్ చేసుంటుంది అంటూ కొందరు నాటుగా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇది చూసిన తర్వాత నెటిజన్లు కూడా కౌంటర్స్ వేస్తున్నారు.
గుడ్ న్యూస్ అంటే పెళ్లి చేసుకుంటున్నారా.. అదేనా సర్ప్రైజ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అదేదో చెప్పొచ్చుగా.. చెప్తే మేం కూడా సంతోషిస్తాంగా శ్రీ రెడ్డి అంటూ కింద కామెంట్స్ బోలెడన్ని వస్తున్నాయి. ఏదేమైనా కూడా శ్రీ రెడ్డి గుడ్ న్యూస్ అనేసరికి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.