WILL SAMANTHA AKKINENI PLAY SENSATIONAL DISHA ROLE AND DIRECTOR ASHWIN SARAVANAN WRITING SCRIPT PK
సమంత అక్కినేని మరో సంచలనం.. దిశ పాత్రలో నటించనుందా..?
ప్రతీకాత్మక చిత్రం
దేశవ్యాప్తంగా ఇప్పుడు దిశ తప్ప మరేం వినిపించడం లేదు. ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది.
దేశవ్యాప్తంగా ఇప్పుడు దిశ తప్ప మరేం వినిపించడం లేదు. ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. అయితే ఇప్పుడు దీనిపై సినిమా వాళ్ల కన్ను కూడా పడుతుందని తెలుస్తుంది. ఏదో ఓ సినిమాలో దిశ ఎపిసోడ్ మొత్తాన్ని ఇతివృత్తంగా వాడుకోవాలని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఈ ఎపిసోడ్ గురించి ఆరా తీస్తున్నారు. ఎమోషనల్‌గా దేశం మొత్తాన్ని కదిలించిన సీన్ కావడంతో ఇలాంటి ఎపిసోడ్ ఒకటి సినిమాలో ఉంటే అదిరిపోతుందని ప్రతీ దర్శక నిర్మాత కూడా భావిస్తున్నాడు.
ప్రతీకాత్మక చిత్రం
అందుకే తమ సినిమాల్లో దిశ ఎపిసోడ్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో అందరికంటే ముందు తమిళ దర్శకుడు దిశ ఎపిసోడ్ నేపథ్యంలో సినిమాకు కథ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సంచలన పాత్రలో అక్కినేని కోడలు సమంత నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్న సమంత.. 'యూ టర్న్', 'ఓ బేబీ' సినిమాలతో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఏకంగా దిశ ఉదంతంపై తెరకెక్కుతున్న సినిమాకు ఈమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది.
సమంత అశ్విన్ శరవణన్
తమిళనాట 'మాయ', 'గేమ్ ఓవర్' లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సమంత దెయ్యం పాత్రలో కనిపించనుందని.. అత్యాచారం, ఆపై హత్యకు గురైన ఓ యువతి ఆత్మరూపంలో వచ్చి తన జీవితం నాశనం చేసిన మృగాళ్లను ఎలా అంతమొందించిందన్నది కథ అనేది తెలుస్తుంది. సమంత ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న '96' రీమేక్ షూటింగ్‌తో పాటు 'ది ఫ్యామిలీ మ్యాన్-2' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఇందులో సమంత నెగటివ్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి దిశ పాత్రలో సమంత కనిపిస్తే సంచలనమే అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.