‘RRR’ విడుదల వాయిదా.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన రాజమౌళి..?

ఒకేరోజు RRR సినిమా గురించి చాలా అప్‌డేట్స్ ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీ ఎవరనే విషయంపై తర్జనభర్జన జరుగుతూనే ఉంది. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ బ్రిటీష్ బ్యూటీ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 20, 2019, 6:42 PM IST
‘RRR’ విడుదల వాయిదా.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన రాజమౌళి..?
RRR మూవీ ప్రెస్ మీట్
  • Share this:
ఒకేరోజు RRR సినిమా గురించి చాలా అప్‌డేట్స్ ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీ ఎవరనే విషయంపై తర్జనభర్జన జరుగుతూనే ఉంది. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ బ్రిటీష్ బ్యూటీ ఒలివియా మొరిస్సా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుందని క్లారిటీ ఇచ్చారు RRR యూనిట్. ఇక ఈ చిత్ర షూటింగ్ కూడా అనుకున్నట్లుగానే జరుగుతుందని కన్ఫర్మ్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసామని.. ఇప్పట్నుంచి మరింత వేగంగా సినిమా పూర్తి చేస్తామని చెప్పారు మేకర్స్. ఈ సినిమాలో మరో ఇద్దరు ఫారెన్ యాక్టర్స్ కూడా నటించబోతున్నారు.

Will RRR movie is going to postponed and Rajamouli given Huge Shock to Jr NTR Ram Charan fans pk ఒకేరోజు RRR సినిమా గురించి చాలా అప్‌డేట్స్ ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీ ఎవరనే విషయంపై తర్జనభర్జన జరుగుతూనే ఉంది. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ బ్రిటీష్ బ్యూటీ.. rrr movie,rrr movie twitter,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమా
rrr సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్


ఐరిష్ బ్యూటీ అలిసన్ డూడీ కీలక పాత్రలో నటించబోతుంది. ఇక మరో హాలీవుడ్ యాక్టర్ రా స్టీవెన్ సన్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. వీళ్లు కూడా త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారంటూ ప్రెస్ నోట్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్ర విడుదల తేదీపై మాత్రం మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాడు రాజమౌళి. సినిమా 10 భాషల్లో 2020లో విడుదలవుతుందని ప్రెస్ నోట్ ఇచ్చాడు కానీ జులై 30 అని మాత్రం అందులో చెప్పలేదు. దాంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి.



ఈ చిత్రం అనుకున్నట్లుగా జులై 30న వస్తుందా లేదంటే మళ్లీ వాయిదా పడుతుందా అనే అనుమానాలు ఇప్పుడు అభిమానుల్లో కలుగుతున్నాయి. క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాడు రాజమౌళి.. అందుకే కాస్త ఆలస్యమైనా కూడా అనుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు చెక్కుతూనే ఉంటాడు ఈ జక్కన్న. ఇందులో కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్.. అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. 300 కోట్లతో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు