వరల్డ్ ఫేమస్ లవర్‌పై విజయ్ దేవరకొండ కోపంగా ఉన్నాడా..?

World Famous Lover: విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ ఇంకా దిగలేదు ఈ హీరోకు. ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2020, 5:03 PM IST
వరల్డ్ ఫేమస్ లవర్‌పై విజయ్ దేవరకొండ కోపంగా ఉన్నాడా..?
వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ (Source: Twitter)
  • Share this:
అదేంటి.. తన సినిమాపై తనకెందుకు కోపం.. పైగా ఈ చిత్రం కోసం తాను చాలా కష్టపడ్డానని.. ఇలాంటి సినిమా మళ్లీ తన జీవితంలో చేయలేనని కూడా చెప్పాడు కదా.. మళ్లీ ఎందుకు కోపం అనుకుంటున్నారా..? దీని వెనక పెద్ద కథే ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ ఇంకా దిగలేదు ఈ హీరోకు. ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వీటి మధ్యలో నోటా, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు డిజాస్టర్ అయినా కూడా విజయ్ మార్కెట్ మాత్రం పెద్దగా పడిపోలేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది.

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer)
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer)


క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాపై విజయ్ మాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదనే సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. దానికి కారణం పారితోషికం అని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ మార్కెట్ ప్రకారం ఈయన ఒక్కో సినిమాకు 5 నుంచి 7 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం ఈయనకు వచ్చిన పారితోషికం తెలిస్తే నిజంగానే షాక్ తప్పదు. కేవలం కోటి రూపాయల రెమ్యునరేషన్‌తోనే విజయ్ ఈ చిత్రాన్ని పూర్తి చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer)
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer)


ఇందులో ఓ లాజిక్ కూడా ఉంది. అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాకు అడ్వాన్స్ ఇచ్చాడు నిర్మాత కేయస్ రామారావు. అప్పుడు విజయ్ మార్కెట్ ప్రకారం కోటి అంటే ఎక్కువే.. కానీ ఈ మూడేళ్లలో మనోడి రేంజ్ పది రెట్లు పెరిగిపోయింది. దాంతో పాత పారితోషికానికే సినిమా చేయడంతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై విజయ్ అనాసక్తిగా కనిపిస్తున్నాడని తెలుస్తుంది. బలవంతంగా ప్రమోషన్స్ చేస్తున్నాడు కానీ మనస్పూర్తిగా కాదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer)
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer)


అయితే అలాంటిదేం లేదు.. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ మనసుకు దగ్గరగా తీసుకుని చేసాడు.. అందుకే ఈ చిత్రం తర్వాత మళ్లీ లవ్ స్టోరీస్ కూడా చేయనని చెప్పాడని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా కూడా నిజంగానే కోటికే ఈ చిత్రం చేస్తే మాత్రం కేయస్ రామారావు కంటే లక్కీ ప్రొడ్యూసర్ మరొకరు ఉండరేమో..? ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. లిప్ లాక్ సన్నివేశాలతో పాటు హాట్ హాట్ సీన్స్‌తో తన స్టైల్‌కు భిన్నంగా క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఈ చిత్రంతో విజయ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: February 11, 2020, 5:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading