రాజమౌళి నెక్ట్స్ సినిమా నిజంగా ఆ హీరోతోనేనా..?

Rajamouli: RRR ఇంకా సెట్స్‌పై ఉండగానే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ తర్వాతి సినిమాల గురించి ఓ ఐడియాకు వచ్చేసారు. అందుకే రాజమౌళి కూడా తన తర్వాతి సినిమా కోసం హీరోను సిద్ధం చేసుకుంటున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 27, 2020, 6:02 PM IST
రాజమౌళి నెక్ట్స్ సినిమా నిజంగా ఆ హీరోతోనేనా..?
దర్శకుడు రాజమౌళి (Rajamouli)
  • Share this:
రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. క్షణం తీరిక లేకుండా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శక ధీరుడు. ఇదిలా ఉంటే RRR ఇంకా సెట్స్‌పై ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్‌తో సెట్ చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా కొరటాల శివతో పాటు గౌతమ్ తిన్ననూరి.. అనిల్ రావిపూడి.. కొత్త దర్శకుడు ప్రదీప్ చెప్పిన కథలను విన్నాడు. అందుకే రాజమౌళి కూడా తన తర్వాతి సినిమా కోసం హీరోను సిద్ధం చేసుకుంటున్నాడు.

RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)


సాధారణంగా ఓ సినిమా చేస్తున్నపుడు తర్వాతి సినిమా గురించి ఆలోచించడు జక్కన్న. కానీ ఈ మధ్య కాస్త మారిపోయాడు. ఈగ చేస్తున్నపుడే బాహుబలి గురించి ఫీలర్స్ ఇచ్చాడు. ఇక బాహుబలి తర్వాత మాత్రం కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని RRR అనౌన్స్ చేసాడు. అయితే ఇప్పుడు RRR చేస్తున్నపుడే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాయడం మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఈ సారి ఎవరూ ఊహించని హీరోతో రాజమౌళి సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.

రామ్‌తో రాజమౌళి సినిమా (Ram Rajamouli movie)
రామ్‌తో రాజమౌళి సినిమా (Ram Rajamouli movie)


అతనెవరో కాదు.. హీరో రామ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సంచలనం సృష్టించిన ఈయన ప్రస్తుతం రెడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అన్నీ కుదిర్తే ఈయనతోనే రాజమౌళి తర్వాతి సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మగధీర తర్వాత మర్యాదరామన్నలా.. రామ్ హీరోగా చిన్న మాస్ సినిమా ఒకటి చేయాలని చూస్తున్నాడు దర్శక ధీరుడు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే రానుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే 2021లో రామ్, రాజమౌళి కాంబినేషన్ చూడొచ్చు.
Published by: Praveen Kumar Vadla
First published: March 27, 2020, 6:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading