వైఎస్ జ‌గ‌న్ ఆ ద‌ర్శ‌కున్ని టార్గెట్ చేస్తాడా.. తెలుగుదేశం ఓట‌మితో సీన్ రివర్స్..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలిచిన త‌ర్వాత ఏపీలో ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన త‌ర్వాత త‌న మార్క్ చూపించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు ఈయ‌న‌. అందులో భాగంగానే కొన్ని కీల‌క‌మైన నిర్ణ‌యాలు కూడా తీసుకుంటున్నాడు జ‌గ‌న్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 5, 2019, 3:50 PM IST
వైఎస్ జ‌గ‌న్ ఆ ద‌ర్శ‌కున్ని టార్గెట్ చేస్తాడా.. తెలుగుదేశం ఓట‌మితో సీన్ రివర్స్..
వైఎస్ జగన్ ఫైల్ ఫోటో
  • Share this:
వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలిచిన త‌ర్వాత ఏపీలో ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన త‌ర్వాత త‌న మార్క్ చూపించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు ఈయ‌న‌. అందులో భాగంగానే కొన్ని కీల‌క‌మైన నిర్ణ‌యాలు కూడా తీసుకుంటున్నాడు జ‌గ‌న్. ఇక ఇప్పుడు ఓ ద‌ర్శ‌క దిగ్గ‌జం వైపు జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఆయ‌నెవ‌రో కాదు.. ద‌ర్శ‌కేంద్రుడు కే రాఘ‌వేంద్ర‌రావు. ఈయ‌న ఈ మ‌ధ్యే టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి నుంచి దిగిపోయారు. వ‌యోభారం కార‌ణంగా రాజీనామా చేసారు.

Will really AP CM YS Jagan Mohan Reddy targeted TTD former chairman K Raghavendra Rao for misused funds pk.. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలిచిన త‌ర్వాత ఏపీలో ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన త‌ర్వాత త‌న మార్క్ చూపించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు ఈయ‌న‌. అందులో భాగంగానే కొన్ని కీల‌క‌మైన నిర్ణ‌యాలు కూడా తీసుకుంటున్నాడు జ‌గ‌న్. ap cm ys jagan,ap cm ys jagan twitter,k raghavendra rao ttd chairman,raghavendra rao ys jagan mohan reddy,director raghavendra rao,ttd raghavendra rao,k.raghavendra rao,k.raghavendra rao resigned to ttd chairman,k raghavendra rao tdp,k raghavendra rao funds misused,k raghavendra rao interview,telugu cinema,కే రాఘవేంద్రరావు,వైఎస్ జగన్,కే రాఘవేంద్రరావు వైఎస్ జగన్,నిధుల దుర్వినయోగం చేసిన కే రాఘవేంద్రరావు,తెలుగు సినిమా
కె రాఘవేంద్రరావు ఫైల్ ఫోటో

దానికి అస‌లు కార‌ణాలు మాత్రం జ‌గ‌న్ గెల‌వ‌డ‌మే అని తెలుస్తుంది. ఆయ‌న వ‌చ్చారు కాబ‌ట్టే ఈయ‌న దిగిపోయార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో విష‌యం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. రాఘ‌వేంద్ర‌రావు శ్రీ వెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ ఛైర్మ‌న్ ప‌ద‌విలో ఉన్న‌పుడు నిధుల దుర్విన‌యోగం జ‌రిగింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంపై అప్పుడు విజులెన్స్ అధికారులు కూడా నిజ‌మే అని తేల్చారు. ద‌ర్శ‌కేంద్రుడు హ‌యాంలోనే కొన్ని అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు గుర్తించారు. కానీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.

Will really AP CM YS Jagan Mohan Reddy targeted TTD former chairman K Raghavendra Rao for misused funds pk.. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలిచిన త‌ర్వాత ఏపీలో ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన త‌ర్వాత త‌న మార్క్ చూపించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు ఈయ‌న‌. అందులో భాగంగానే కొన్ని కీల‌క‌మైన నిర్ణ‌యాలు కూడా తీసుకుంటున్నాడు జ‌గ‌న్. ap cm ys jagan,ap cm ys jagan twitter,k raghavendra rao ttd chairman,raghavendra rao ys jagan mohan reddy,director raghavendra rao,ttd raghavendra rao,k.raghavendra rao,k.raghavendra rao resigned to ttd chairman,k raghavendra rao tdp,k raghavendra rao funds misused,k raghavendra rao interview,telugu cinema,కే రాఘవేంద్రరావు,వైఎస్ జగన్,కే రాఘవేంద్రరావు వైఎస్ జగన్,నిధుల దుర్వినయోగం చేసిన కే రాఘవేంద్రరావు,తెలుగు సినిమా
కె రాఘవేంద్రరావు వైఎస్ జగన్

అన్న‌గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుదేశంకు వీర విధేయుడిగా ఉన్నాడు రాఘ‌వేంద్ర‌రావు. దాంతో చంద్ర‌బాబు కూడా ఎప్పుడూ ఈయ‌న‌పై క‌న్నేయ‌లేదు. అయితే ఇప్పుడు ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత ఆ కేసుల‌ను కొత్త ముఖ్య‌మంత్రి మ‌ళ్లీ తిర‌గ‌తోడాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తుంది. విజులెన్స్ అధికారుల‌కు కూడా జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చాడ‌ని.. రాఘ‌వేంద్ర‌రావు టైమ్‌లో జ‌రిగిన నిధుల దుర్వినియోగంపై మ‌రోసారి లెక్క‌లు తేల్చాల‌ని జ‌గ‌న్ కోరిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే గానీ జ‌రిగిందంటే క‌చ్చితంగా ద‌ర్శ‌కేంద్రుడికి తిప్ప‌లు మాత్రం బాగా గ‌ట్టిగా ఉంటాయేమో..?
First published: June 5, 2019, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading