ఆనందంగా ఉండే ఇల్లు కాస్తా ఇప్పుడు విషాదానికి చిరునామాగా మారిపోయింది. ఎప్పుడూ తన యాంకరింగ్‌తో పది మందిని నవ్వించే సుమ ఇప్పుడు ఏడుస్తుంది. ఆమె కుటుంబం కూడా విషాదంలోనే ఉంది. ఎందుకో తెలియదు కానీ రాజీవ్, సుమ కనకాల ఇంట్లో వరసగా విషాదాలు జరుగుతున్నాయి. రాజీవ్ సొంత అక్క శ్రీలక్ష్మి కనకాల అకాల మరణంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మూడేళ్లుగా వరస విషాదాలు ఆ కుటుంబాన్ని బాధ పెడుతూనే ఉన్నాయి. 2018లో రాజీవ్ తల్లి.. గతేడాది ఆయన తండ్రి దేవదాస్ కనకాల.. ఇప్పుడు ఆయన అక్క శ్రీలక్ష్మి కన్నుమూసారు. దాంతో రాజీవ్ కనకాల కోలుకోలేని షాక్‌లోకి వెళ్లిపోతున్నాడు.
ఈ సమయంలో ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు ఉన్నారు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న శ్రీలక్ష్మి.. ఆరోగ్యం విషమించడంతో ఎప్రిల్ 6న కన్నుమూసింది. మూడేళ్ల గ్యాప్‌లోనే మూడు మరణాలు ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసాయి. అయితే దీనికి కొన్ని జ్యోతిష్య కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. నిజానికి సుమ, రాజీవ్ ఓ భారీ ఇల్లు కట్టుకుంటున్నారు. స్టార్స్ అంతా ఉండే ఏరియాలోనే ఈ నిర్మాణం జరుగుతుంది. గతేడాదే ఈ ఇంట్లోకి వెళ్లాల్సి ఉండగా.. అప్పుడే మామయ్య దేవదాస్ కనకాల చనిపోయాడని సుమ తన గృహ ప్రవేశం తేదీని మార్చుకున్నారు. ఈ ఇంటికి తుది మెరుగులు దిద్దించారు.
దేవదాస్ కనకాల కంటే ముందు ఏడాది ఆమె అత్తగారు కూడా చనిపోయారు.. ఇప్పుడు ఆడపడుచు కూడా చనిపోవడంతో ఆ ఇంట్లో దోషం ఉందంటూ కొందరు జ్యోతిష్కులు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మరికొందరు మాత్రం దోషం లాంటిదేమీ లేదు.. 70 ఏళ్లు దాటిన తర్వాత కనకాల దంపతులు చనిపోతే.. రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న శ్రీలక్ష్మి ఇప్పుడు చనిపోయారు. మూడు మరణాలు ఊహించినవే కానీ అనుకోనివి మాత్రం కావని చెబుతున్నారు. చిన్నచిన్న శాంతి పూజలు చేసి హాయిగా గృహ ప్రవేశం చేసుకోవచ్చని సుమకు కొందరు ధైర్యం చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తన ఆడపడుచు పిల్లల బాధ్యతను కూడా ఇప్పుడు ఈమె తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood