Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 13, 2020, 10:11 PM IST
అల్లు అర్జున్ (Allu Arjun OTT)
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకడు. మొన్నటి వరకు టాప్ 5లో ఈయన ఉంటాడా లేదా అనే అనుమానాలు ఉండేవి. కానీ అల వైకుంఠపురములో విజయంతో టాప్ 3లోకి వచ్చేసాడు ఈయన. పవన్ కళ్యాణ్, మహేష్ బాబును పక్కనబెడితే ఆ తర్వాత స్థానం కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి పోటీ పడుతున్నాడు అల్లు అర్జున్. అల వైకుంఠపురములో ఏకంగా 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడంతో బన్నీ రేంజ్ ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్నాడు అల్లు అర్జున్. ఇదిలా ఉంటే ఈయన త్వరలోనే ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్లో కొందరు హీరోలు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి అడుగు పెట్టారు. హీరోయిన్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో సమంత అక్కినేని, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఓటిటిలోకి అడుగు పెట్టారు. అందులో సమంత, తమన్నా ఆహాలోనే ఉన్నారు.
ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఓటిటిలో ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. తండ్రి స్థాపించిన ఆహా యాప్ కోసం బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు బన్నీ. అందులో భాగంగానే తాజాగా జరిగిన ఆహా గ్రాండ్ రివీల్ ఈవెంట్‌కు బన్నీ వచ్చాడు. అక్కడ మనసులో మాట చెప్పుకొచ్చాడు బన్నీ. నవదీప్ ఈ షోకు హోస్టింగ్ చేసాడు. బన్నీ, నవదీప్ ఇద్దరూ మంచి స్నేహితులు. బావా బావా అనుకుంటారు.. అంత క్లోజ్ ఫ్రెండ్స్. అయితే మీ నాన్న కోసం నువ్వు ఓటిటిలోకి ఎప్పుడు వస్తావ్ అంటూ బన్నీని అడిగాడు నవదీప్.

అల్లు అర్జున్ (Allu Arjun OTT)
ముందు తన మార్క్ డైలాగ్ చెప్పను బావా అన్నాడు కానీ ఆ తర్వాత వస్తానేమో.. త్వరలోనే వస్తానేమో అంటూ సమాధానమిచ్చాడు. నాన్నకు ప్రేమతో అలా చెప్పాడా లేదంటే నిజంగానే తమ సొంత ప్లాట్ ఫామ్ ఆహా కోసం వెబ్ సిరీస్ లాంటిదేమైనా చేస్తాడేమో చూడాలి. ఏదేమైనా కూడా బన్నీ లాంటి సూపర్ స్టార్ కానీ ఒక్కసారి ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చాడంటే రచ్చ రంబోలా కావడం ఖాయం. ఆ దెబ్బతో ఆహా రేంజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది. మరి చూడాలిక.. ఇది జరుగుతుందో లేదో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
November 13, 2020, 10:11 PM IST