రంగస్థలం సిట్టిబాబును స్మగ్లర్ పుష్పరాజ్ మరిపిస్తాడా..?

Pushpa movie: అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 8, 2020, 2:18 PM IST
రంగస్థలం సిట్టిబాబును స్మగ్లర్ పుష్పరాజ్ మరిపిస్తాడా..?
రామ్ చరణ్ అల్లు అర్జున్ (ram charan allu arjun)
  • Share this:
ఇప్పుడు పుష్ప ఫస్ట్ లుక్ చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం వస్తుంది. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లుక్ చూసిన తర్వాత.. అందులో బన్నీ లుక్ చూసిన తర్వాత ఇది కూడా కచ్చితంగా ఇండస్ట్ర్రీ రికార్డులు తిరగరాసేలా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదిలా ఉంటే మరోసారి రెట్రో లుక్‌తోనే అలరించాడు సుకుమార్. రంగస్థలం సినిమాను 1980ల నేపథ్యంలో తెరకెక్కించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఈ దర్శకుడు.
ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా అల్లు అర్జున్ సుకుమార్ ‘పుప్ఫ’ మూవీ (Twitter/Photos)
ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా అల్లు అర్జున్ సుకుమార్ ‘పుప్ఫ’ మూవీ (Twitter/Photos)


ఇప్పుడు కూడా మరోసారి అదే చేస్తున్నాడనిపిస్తుంది పోస్టర్ చూస్తుంటే. ఇప్పుడు కూడా 80స్ బ్యాక్‌డ్రాప్‌లోనే పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటి కథల కంటే రెట్రో కథలే ఈయనకు బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అందుకే మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు బన్నీ లుక్ చూసిన తర్వాత సిట్టిబాబును ఈయన మరిపిస్తాడా అనే ఆసక్తి కూడా మొదలైపోయింది. రామ్ చరణ్ కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా రంగస్థలం సిట్టిబాబు పాత్ర మాత్రం ప్రత్యేకం.
రంగస్థలం రామ్ చరణ్ (rangasthalam ram charan)
రంగస్థలం రామ్ చరణ్ (rangasthalam ram charan)

అలాంటి కారెక్టర్ మళ్లీ తన జీవితంలో రాదని చరణ్ కూడా చెప్పాడు. దాంతో సుకుమార్ మళ్లీ ఇప్పుడు అలాంటి పాత్రనే క్రియేట్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. బన్నీ పుష్ప తర్వాత మరోసారి సుకుమార్, చరణ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్తలున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప రాజ్ కారెక్టర్‌తో సిట్టిబాబును మరిపించే ప్రయత్నం చేస్తున్నాడు బన్నీ.
రామ్ చరణ్ అల్లు అర్జున్ (ram charan allu arjun)
రామ్ చరణ్ అల్లు అర్జున్ (ram charan allu arjun)

అలా కానీ చేసాడంటే కచ్చితంగా మరో సంచలనానికి సుకుమార్ తెర తీసినట్లే. మరీ ముఖ్యంగా అచ్చంగా రంగస్థలం మాదిరే ఇది కూడా పూర్తిగా డీ గ్లామరైజ్డ్ కారెక్టరే. రష్మిక మందన్న కూడా ఇందులో రంగస్థలం రామలక్ష్మిలా కనిపించబోతుంది. అనసూయ కూడా ఈ సినిమాలో ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. మరి చూడాలిక.. సిట్టిబాబును ఈ పుష్పరాజ్ కొట్టేస్తాడో లేదో..?
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading