Mehreen Pirzada: టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న మెహరీన్.. ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, పంజాబీ, హిందీ సినిమాల్లో కూడా నటించింది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఓ ఇంటి కోడలు కానుంది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్ దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్ తో మధ్యప్రదేశ్ జైపూర్లోని అలీల కోటలో ఈ మధ్యనే పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను, తన కాబోయే భర్తతో కలిసి తీయించుకున్న ఫోటో షూట్ లను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఇక వీరి పెళ్లి త్వరలోనే కానున్న సందర్భంగా.. తన అభిమానుల్లో ఓ ఆలోచన మొదలైంది. తన పెళ్లి తర్వాత సినిమాలలో నటిస్తుందో లేదో అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ తమ పెళ్లికి ముందు వరుస ఆఫర్ లతో దూసుకుపోగా.. తమ పెళ్లి తర్వాత చాలావరకు తమ అవకాశాలను తగ్గించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లి చేసుకోబోయే మెహరీన్ కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అని వార్తలు బాగా చర్చనీయాంశమైంది. ఇక ఈ విషయం గురించి క్లారిటీగా తెలియాలంటే మెహరీన్ నోరు విప్పే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే మెహరిన్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది. ఇదివరకే ఎఫ్ 2 లో నటించిన ఈ బ్యూటీ తన నటనతో బాగా ఆకట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actress Mehreen Pirzada, After marriage, Love story, Mehreen Pirzada, Nani, Ravi Teja, Tollywood, రవితేజ