తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయంది. ఒకప్పుడు రాజమౌళి డైరెక్షన్‌లోని సినిమాలు మాత్రమే పాన్ ఇండియా ఆడియెన్స్‌ను ఆకట్టుకోగా.. అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ ఈ విషయంలో కొత్త రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ ఆడియెన్స్‌ను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తగ్గేదేలే అనే డైలాగ్ బాలీవుడ్‌లోని సగటు ప్రేక్షకుడిని కూడా కట్టిపడేసింది. పుష్ప మూవీ బాలీవుడ్లో ఓ రేంజ్లో సక్సెస్ కావడంతో.. పుష్ప 2 (Pushpa 2) సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే పుష్ప సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించిన సుకుమార్.. ఈ సినిమాను తెరకెక్కించేందుకు కేజీఎఫ్ మూవీని స్పూర్తిగా తీసుకున్నారనే వార్తలు వచ్చాయి.
కేజీఎఫ్ (KGF) ఫస్ట్ పార్ట్ తరహాలోనే పుష్ప ఫస్ట్ పార్ట్‌లో హీరో ఏ విధంగా అందరినీ శాసించే స్థాయికి వచ్చాడనే విషయాన్ని చూపించారు. ఇక పుష్ప సెకండ్ పార్ట్‌లో హీరో ఏ విధంగా అందరినీ శాసించాడు. తనను టార్గెట్ చేసిన వారిని ఎలా ఎదుర్కొన్నాడనే విషయం చూపించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే పుష్ప 2 సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తామని మూవీ మేకర్లు ముందుగానే ప్రకటించారు.
అందుకు తగ్గట్టుగానే షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకున్నారని సమాచారం. అయితే పుష్ప 2 సినిమాకు ఇటీవల రిలీజై సూపర్ డూపర్ హిట్ అయిన కేజీఎఫ్ 2 కొత్త టార్గెట్ ఫిక్స్ చేసిందని టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ రేంజ్లో పుష్ప ఉండాలని అనుకున్న సుకుమార్.. ఆ విషయంలో చాలావరకు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కేజీఎఫ్ 2 కూడా భారీ హిట్ కావడంతో.. పుష్ప 2ను కేజీఎఫ్ 2ను మించిన స్థాయిలో తెరకెక్కించాలని దర్శకుడు సుక్కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో యాక్షన్ సీన్లు కూడా అంతే స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు మరే ఇతర సినిమాలకు కమిట్ కావొద్దని స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ డిసైడయినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కేజీఎఫ్ 2 టార్గెట్‌గా తెరకెక్కబోతున్న పుష్ప 2.. అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటుందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.