• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • WILL PRABHAS AND PAWAN KALYAN TAKE UP THE CHALLENGE AND PROVE THEIR STAMINA MHN

Prabhas - Pawan Kalyan: ప్రభాస్, పవన్ ముందున్న ఛాలెంజ్.... రేంజ్ ప్రూవ్ చేసుకుంటారా?

Prabhas - Pawan Kalyan: ప్రభాస్, పవన్ ముందున్న ఛాలెంజ్.... రేంజ్ ప్రూవ్ చేసుకుంటారా?

Will Prabhas and Pawan Kalyan take up the challenge and prove their stamina

Prabhas - Pawan Kalyan: రీసెంట్‌గా విడుదలైన కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2 టీజర్‌ ఎలాంటి రికార్డ్‌ క్రియేట్‌ చేసిందో మనకు తెలిసిందే. మరి ఈ సంక్రాంతికి మన టాలీవుడ్‌ నుండి ఇద్దరు అగ్ర హీరోల టీజర్స్‌ విడుదల కానున్నాయి. మరి ఆ టీజర్స్‌ ఇలాంటి రికార్డులను క్రియేట్‌ చేస్తాయా...

  • Share this:
    టాలీవుడ్‌లో అగ్ర కథానాయకులు చాలా మందే ఉన్నారు. అయితే ఈ హీరోలందరికీ మరో భాషకు చెందిన స్టార్‌ హీరో ఇన్‌డైరెక్టర్‌గా, డైరెక్ట్‌గా పెద్ద ఛాలెంజే విసిరాడు. ఆ హీరో ఎవరనే సంగతిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌. ఈయన హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2'. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ టీజర్‌ క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించడమే కాదు.. 5 మిలియన్‌ పైగా వ్యూస్‌ను సాధించింది. ఇప్పటి వరకు ఏ స్టార్‌ హీరో సినిమా సాధించని సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు... యష్‌. ఇప్పుడు ఈ హీరో క్రియేట్‌ చేసిన రికార్డులు మన స్టార్స్‌కు పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది. మనకు కాదండి.. బాలీవుడ్‌ స్టార్స్‌కు యష్‌ ఛాలెంజ్‌ విసిరినట్టే.

    టాలీవుడ్ విషయానికి వస్తే.. ఇప్పుడు వెంటనే రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రాధేశ్యామ్ ప్రీ టీజర్‌ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. అలాగే పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన వకీల్‌ సాబ్‌ సినిమా టీజర్‌ కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్‌ హీరోల ముందు యష్‌ విసిరిన ఛాలెంజ్‌ ఉంది. ఈ ఇద్దరిలో పవన్‌కల్యాణ్‌ అంటే టాలీవుడ్‌కి మాత్రమే పరిమితం. కానీ ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌. ఆయన రాధేశ్యామ్‌ సినిమా టీజర్‌ ఇలాంటి రికార్డును క్రియేట్‌ చేస్తుందా? అనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఆయన అభిమానుల్లో తెలియని కసి, టెన్షన్‌ను పెంచుతుంది. మరి మన టాలీవుడ్‌ హీరోలు ఈ రికార్డులను క్రియేట్‌ చేయడం అంటే చాలా కష్టమైన విషయమే. మరి వారేం చేస్తారో చూడాలి.

    అప్పుడెప్పుడో రాజ‌మౌళి బ‌ద్ధ‌లు కొట్టిన రికార్డుల లెగ‌సీని ఇప్పుడు య‌ష్ కంటిన్యూ చేస్తున్నాడు. ముందు నువ్వు న‌డువు బ్రో... వెనక ఆ రికార్డుల‌ను మేం కంటిన్యూ చేస్తాం అని అంటున్నారు మన ప్యాన్‌ ఇండియా హీరోలు అంటారా? లేక కామ్‌గా ఉండిపోతారా అని తెలియాలి. అయితే నంద‌మూరి, మెగా అభిమానుల మీద ఇప్పుడు బాధ్య‌త మ‌రింత‌గా ఉంద‌నడంలో సందేహం లేదనే చెప్పాలి.
    Published by:Anil
    First published: