news18-telugu
Updated: August 31, 2019, 4:56 PM IST
అఖిల్ అక్కినేని ఫైల్ ఫోటో
అక్కినేని మూడో తరం రెండో నట వారసుడు అఖిల్‌కు కాలం కలిసి రావడం లేదు. ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అతడు.. హీరోగా మాత్రం ఒక్క హిట్‌ను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. హీరోగా చేసిన మూడు చిత్రాలు నిరాశ పరిచాయి. ఆకట్టుకునే అందం.. ఫిజిక్.. నటన ఉన్నా.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అతడు చేసిన మూడు ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు ఈ అక్కినేని నట వారసుడు. అందుకే ఈ సారి చేయబోయే సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. దీనికితోడు ‘బొమ్మరిల్లు’ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొన్న భాస్కర్ కూడా తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధమయ్యాడు. 2013లో ‘ఒంగోలు గిత్త’ సినిమా తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా అఖిల్‌ను మెప్పించడమే కాదు.. గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్లో సినిమాను ఒకే చేయించుకొన్నాడు. ఈ సారి ఎలాగైనా కుంభస్థలం కొట్టేంతగా స్క్రిప్టును రెడీ చేసుకొన్నారనే మాట వినిపిస్తున్నది. ఇదిలావుంటే ఈ ప్రాజెక్ట్ తెర మీదకు వచ్చినప్పటి నుంచి హీరోయిన్ ఎవరనే ప్రశ్న మీడియాను వెంటాడుతోంది . అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. మొదట్లో ఈ ప్రాజెక్ట్ కు అనుపమ పరమేశ్వరన్‌ను అనుకొన్నారు.

అఖిల్, పూజా
కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో ఆమె అఖిల్ సరసన నటించడానికి నో చెప్పేసినట్టు సమాచారం. ఆ తర్వాత మంచి ఊపు మీద ఉన్న రష్మిక మందన్న ట్రై చేశారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పలేకపోయినట్టు తెలుస్తోంది.ఇదే క్రమంలో అఖిల్ సరసన ఏ హీరోయిన్ అయితే బాగుంటుందని లెక్కలేసుకొన్న యూనిట్ చివరకు హాట్ అండ్ గ్లామర్ గర్ల్ పూజా హెగ్గేను ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో అల్లు అర్జున్‌తో డీజేలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో మెగా హీరో వరుణ్ తేజ్‌తో వాల్మీకి చిత్రంలో నటిస్తోంది. అయితే అఖిల్ సరసన పూజా హెగ్డే ఏమిటనే అనుమానాలు తొలుత మీడియాలో వ్యక్తమయ్యాయి. కారణం అఖిల్ కంటే పూజా వయసు పెద్దదిగా కనిపిస్తుంది, అఖిల్ పక్కన ఎలా సూట్ అవుతుంది అనే గుసగుసలు వినిపించాయి. అయితే కథలో ఉండే ఇంటెన్సిటీ, పాత్ర తీరు తెన్నులు అలాంటి ఫీలింగ్‌ను కలిగించవు అనే యూనిట్ పేర్కొంటోంది . ఏదేమైనా . కథపరంగా అటు భాస్కర్‌కే కాదు.. అఖిల్ ఖాతాలో సంపూర్ణంగా సక్సెస్ ఈ సినిమా ఇస్తుంది అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 31, 2019, 4:56 PM IST