news18-telugu
Updated: June 18, 2020, 12:01 PM IST
నిహారిక కొణిదెల (Photo: Niharika Konidela)
మెగా డాటర్ నిహారకి కొణిదెల మ్యారేజ్ ఫిక్స్ అయిందా. త్వరలోనే ఆమె ఒకింటామె కాబోతుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ కూడా పెళ్లి చేసుకొని ఒకింటి వారయ్యారు. ఇంకోవైపు హీరో రానా దగ్గుబాటి కూడా త్వరలో మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అటు నితిన్ కూడా ఈ యేడాది చివర్లో పెళ్లి పీఠలు ఎక్కనున్నాడు. ఈ బాటలోనే నిహారిక కూడా త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఇప్పటికే నాగబాబు ... వీలైతే ఈ యేడాదే నిహారికకు మ్యారేజ్ చేయబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ చూస్తే అదే నిజమే అనిపిస్తోంది. అందులో నిహారిక ఒక గ్లాస్ పై మిస్ బదులు మిసెస్ అని రాసి ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది.
దీన్ని బట్టి నిహారిక తాను త్వరలో ఒకింటామె కాబోతున్నట్టు సంకేతాలు ఇచ్చింది. మొత్తంగా నిహారిక పెళ్లి చేసుకొని సినిమాలకు ప్యాకప్ చెప్పేస్తుందా.. లేకపోతే.. మ్యారేజ్ తర్వాత కూడా తన నటనను కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక నిహారికకు కాబోయే వరుడు ఎవరేనది మాత్రం తెలియాల్సి ఉంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
June 18, 2020, 12:01 PM IST