జబర్దస్త్ షోకు నాగబాబు రీ ఎంట్రీ.. గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్..

Nagababu: జబర్దస్త్ షోకు నాగబాబు మళ్లీ వస్తున్నాడా..? మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్‌పై అన్ని విమర్శలు చేసిన నాగబాబు మళ్లీ అదే షోకు జడ్జిగా వస్తాడా..? అసలు ఈ అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి అనుకుంటున్నారా..? గెటప్ శ్రీను చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 28, 2020, 5:17 PM IST
జబర్దస్త్ షోకు నాగబాబు రీ ఎంట్రీ.. గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్..
నాగబాబు (Nagababu)
  • Share this:
జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఎందుకో తెలియదు కానీ ఒక కళ అయితే తప్పింది. రోజా ఉన్నా కూడా నాగబాబు లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. ఎంతమంది జడ్జులు వస్తున్నా వెళ్తున్నా కూడా నాగబాబు ప్లేస్ అలాగే కనిపిస్తుంది. ఆయన లేని చోటు.. ఆ నవ్వులు జబర్దస్త్ అభిమానులు బాగానే మిస్ అవుతున్నారు. చూస్తుండగానే నాగబాబు ఈ షోను వదిలేసి మూడు నెలలు దాటేసింది. అప్పట్నుంచి చాలా మంది జడ్జులు వస్తున్నారు వెళ్తున్నారు. నరేష్, పోసాని, తరుణ్ భాస్కర్ ఇలా చాలా మంది వస్తున్నారు.. కానీ పర్ఫెక్ట్ జడ్జి మాత్రం దొరకడం లేదు. మరోవైపు నాగబాబు మాత్రం అదిరింది షోకు ఫిక్స్ అయిపోయాడు. కానీ ఆ షో మాత్రం అనుకున్న రేటింగ్స్ తీసుకురావడం లేదు.

నాగబాబు (Nagababu)
నాగబాబు (Nagababu)


వేణుతో పాటు ధనరాజ్, చమ్మక్ చంద్ర లాంటి టీమ్స్ చాలా మంది ఉన్నా కూడా ఎందుకో అదిరింది షోకు అనుకున్న రేటింగ్ అయితే రావడం లేదు. దాంతో ఇప్పుడు అక్కడ్నుంచి బయటపడాలని నాగబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎక్కడికి వస్తాడనేది ఆసక్తికరంగా మారుతున్న సమయంలో మళ్లీ సొంత గూటికి వస్తాడనే ప్రచారం జోరందుకుంది. ఇదే సమయంలో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను సంచలన నిజాలు చెప్పాడు. తాజాగా సుడిగాలి సుధీర్, రాంప్రసాద్‌తో కలిసి ఈయన హీరోగా నటించిన 3 మంకీస్ సినిమా ట్రైలర్ లాంఛ్ జరిగింది. అక్కడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు గెటప్ శ్రీను.

అదిరింది (Adirindi Zee Telugu) షోలో మాజీ జబర్దస్త్ కమెడియన్స్ వేణు ధన్‌రాజ్
ముఖ్యంగా నాగబాబు గురించి అడిగినపుడు సంచలన వ్యాఖ్యలు చేసాడు శ్రీను. ఆయన జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడం అనేది పూర్తిగా ఆయన పర్సనల్ అని.. ఆయన లేని లోటు కనిపిస్తుందని చెప్పాడు శ్రీను. అంతే కాదు అదిరింది చేసినా.. ఇంకో షో చేసినా అంతా ఓ కుటుంబంలా కలిసుంటామని చెప్పుకొచ్చాడు గెటప్ శ్రీను. ఈ క్రమంలోనే నాగబాబు జబర్దస్త్ షోలోకి మళ్లీ రావచ్చనే సందేశాలతో పాటు సందేహం కూడా రేపాడు గెటప్ శ్రీను. ఆయన వస్తే బాగుంటుందని.. రావాలనే కోరుకుంటున్నామని చెప్పాడు. ఆయన వచ్చే సూచనలు కూడా ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. అయితే అదెప్పుడు అనేది మాత్రం చెప్పలేదు.

నాగబాబు, గెటప్ శ్రీను (Nagababu Getup Srinu)


ఒకవేళ నాగబాబు రీ ఎంట్రీ ఇస్తే మాత్రం ఆయన్నే నమ్ముకుని వెళ్లిన చంద్ర, ఆర్పీ లాంటి కమెడియన్ల పరిస్థితి ఏంటనేది మాత్రం అగమ్యగోచరంగా మారింది. దానికితోడు అదిరింది షోను డిజైన్ చేసిందే జబర్దస్త్ మాజీ దర్శకులు నితిన్ భరత్. మరి వాళ్ల కోసమే బయటికి వెళ్లిన నాగబాబు.. వాళ్లను వదిలేసి ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ షోకు వస్తాడా..? ఒకవేళ ఆయన రావాలి అనుకోకపోతే నాగబాబు వస్తున్నాడని గెటప్ శ్రీను ఎందుకు హింట్ ఇస్తాడు..? ఏమో ప్రస్తుతానికి అయితే అన్నీ ప్రశ్నలే.. దీనికి సమాధానాలు మాత్రం త్వరలోనే వస్తాయి. అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పదు.
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు