Maa Elections: మోహన్ బాబు ‘మా’ గొడవకు ముగింపు పలుకుతారా ?.. ఆ భేటీ జరుగుతుందా ?

మోహన్ బాబు

Chiranjeevi-Mohan Babu: మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చలు జరిపితే.. ‘మా’‌లో తలెత్తిన వివాదం సమసిపోయే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    మా ఎన్నికల అనంతరం నెలకొన్న పరిస్థితులు ఇప్పుడప్పుడే సర్ధుకుంటాయా ? అనే చర్చ సినీవర్గాల్లో సాగుతోంది. ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయడంతో.. ఈ విషయంలో మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తిరేపుతోంది. దీనిపై ఇంకా ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే మా ఎన్నికల్లో గెలిచిన అనంతరం మంచు విష్ణు, తన తండ్రి మోహన్ బాబుతో (Mohan babu)కలిసి అగ్ర హీరో బాలకృష్ణను కలిశారు. మా ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచినందుకు ఆయనకు మద్దతు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన మరికొందరు ప్రముఖులను కూడా కలిస్తున్న మంచు విష్ణు.. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) కూడా కలవనున్నట్టు ప్రకటించారు.

    ఒకవేళ మంచు విష్ణు చిరంజీవిని కలిసి ఆయన అశీస్సులు తీసుకుంటే.. మాలో చెలరేగిన వివాదం దాదాపుగా సమసిపోతుందనే చర్చ జరుగుతోంది. ప్రకాశ్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉందనే విషయం బహిరంగ రహస్యమే. మెగా బ్రదర్ నాగబాబు ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు మద్దతుగా రంగంలోకి దిగి ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. ప్రకాశ్ రాజ్ ఓటమి తరువాత ఆయనలాగే నాగబాబు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రాజీనామా చేశారు. మోహన్ బాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు.

    అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇంకెవరూ ఈ అంశంపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చలు జరిపితే.. ‘మా’‌లో తలెత్తిన వివాదం సమసిపోయే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాన్ని ఇంతకంటే ఎక్కువ చేయొద్దని పలువురు భావిస్తున్నారు. ఇందుకోసం చొరవ తీసుకోవాలని సినీ పెద్దలను కోరుతున్నారు. అయితే చిరంజీవి, మోహన్ బాబు కలిసి చర్చలు జరిపితేనే.. ఈ మొత్తం వివాదం ఓ కొలిక్కి వస్తుందనే చర్చ జరుగుతోంది.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    కరోనా తగ్గుముఖం పట్టి సినీ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఇలాంటి వివాదాలు సినీ రంగానికి మేలు చేయవనే భావన చాలామందిలో ఉంది. అందుకే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి.. ఇండస్ట్రీ సమస్యలపై ప్రభుత్వాలతో చర్చించి.. సాధ్యమైనంత తొందరగా పరిష్కారం కనుక్కోవాలని అంతా కోరుకుంటున్నారు. మరి.. మంచు విష్ణు చెప్పినట్టు ఆయన చిరంజీవిని కలుస్తారా ? ఆ కలయికతో అయినా మా వివాదానికి ముగింపు ఉంటుందా ? అన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: