WILL MEGASTAR CHIRANJEEVI WANTS TO REMAKE HIS OLD SUPER HIT MOVIE WITH HARISH SHANKAR TA
క్రేజీ డైరెక్టర్‌తో తన పాత సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న చిరంజీవి..
చిరంజీవి (Chiranjeevi/Twitter)
ఈ మధ్యకాలంలో మన హీరోలు, దర్శకులు పాత కథలపై మక్కువ చూపుతున్నారు. అప్పట్లో హిట్టైన పాత సూపర్ హిట్ సినిమాలను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు సీక్వెల్ తీయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా చిరంజీవితో ఆయన పాత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ మధ్యకాలంలో మన హీరోలు, దర్శకులు పాత కథలపై మక్కువ చూపుతున్నారు. అప్పట్లో హిట్టైన పాత సూపర్ హిట్ సినిమాలను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు సీక్వెల్ తీయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా హరీష్ శంకర్.. చిరంజీవితో ఆయన పాత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అది కూడా చిరు నటించిన పాత సూపర్ హిట్ ‘రౌడీ అల్లుడు’ సినిమాకు సీక్వెల్ తీయాలని ఉందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ‘రౌడీ అల్లుడు’ సినిమాను కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి తోడల్లుడు డాక్టర్ కే.వేంకటేశ్వరరావు నిర్మించారు. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు. 1991లో విడుదలై ఈ చిత్రంలో చిరు.. కళ్యాణ్గా ఆటోజానీగా రెండు పాత్రల్లో ఇరగదీసాడు. అంతేకాదు ఈ చిత్రానికి బప్పిలహరి ఇచ్చిన మ్యూజిక్ పెద్ద ఎస్సెట్‌గా నిలిచి ఈ చిత్రంలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇక శోభన, దివ్యభారతితో చిరంజీవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్యతో చిరు కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయించాయి.
‘రౌడీ అల్లుడు లో ఆటోజానీగా,కళ్యాణ్గా రెండు పాత్రల్లో ఒదిగిపోయిన చిరంజీవి’(ఫేస్బుక్ ఫోటో)
అలాంటి ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే మాటలు కాదు. రౌడీ అల్లుడు వంటి మాస్ ఓరియంటెడ్ మూవీ స్క్రిప్ట్ ఇప్పటి ట్రెండ్‌లో చిరంజీవికి అంతగా సూట్ కాదు.ఈ వయసులో ఆటోజానీ లాంటి గ్రేస్ ఉన్న క్యారెక్టర్‌ను చిరు ఈ ఏజ్‌లో చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా. మెగాస్టార్ కూడా ఈ పాత్ర చేయడానికి ఇప్పటి పరిస్థితుల్లో ఒప్పుకోకపోవచ్చు.
చిరంజీవి హరీష్ శంకర్ (chiranjeevi harish shankar)
ఐతే గీతే.. రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోలకు ఇలాంటి స్క్రిప్ట్ వర్కౌట్ అవుతోంది. రామ్ చరణ్ కూడా తనకు రౌడీ అల్లుడు లాంటి మాస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేయాలని ఉందని ఎన్నోసార్లు తన మనసులో మాట బయటపెట్టాడు. మరి చూడాలి.. దర్శకుడు హరీష్ శంకర్ రౌడీ అల్లుడు లాంటి సబ్జెక్ట్‌ను ఇప్పటి పరిస్థితుల్లో చిరంజీవితో కాకుండా రామ్ చరణ్‌తో చేస్తే వర్కౌట్ అవుతుందని మెగాభిమానులు కోరకుంటున్నారు. మరి హరీష్ శంకర్ ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. మెగాస్టార్‌తో ఏదైనా మంచి సబ్జెక్ట్ ఉన్న కథతో హరీష్ శంకర్ సినిమా చేస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.