టెలివిజన్‌లో నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఈ షోకు అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు.ఇప్పటికే తెలుగులో కూడా ఈ షో మొదలై రెండు సీజన్ లను పూర్తి చేసుకొంది. ప్రస్తుతం మూడో సీజన్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. కంటెస్టంట్ లను కన్ఫర్మ్ చేశారని ఓ లిస్ట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరికొన్ని రోజుల్లో తెలుగు టెలివిజన్‌లో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూడో సీజన్‌ను హోస్ట్ చేసేది ఎవరు? కంటెస్టెంట్స్ ఎవరు? ఎప్పటి నుండి ప్రసారం కాబోతుంది? ఇలాంటి విషయాలపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌ను హోస్ట్‌గా ఎవరు ఉండబోతున్నారనే విషయంపై చర్చ ఊపందుకుంది. సీజన్ 1కి హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరించగా.. 2వ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా ఉండి సెలబ్రిటీగా మారిన ఒక కంటెస్టెంట్.. ఈ షోలో ఎవరు ఉంటే బాగుంటుందన్న దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

శ్రీరెడ్డి,నాగబాబు
ఈసారి కింగ్ నాగార్జున ఈ షోను హోస్ట్ చేయబోతున్నారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో తన యాంకరింగ్ ఎలా ఉంటుందో ఆడియన్స్‌కు రచి చూపించాడు. ఇప్పుడు దాన్ని బిగ్ బాస్ ద్వారా నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళ్తారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంటూ సదరు పార్టిసిపెంట్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్త పరిచాడు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. మన అందరి ఊహలకు భిన్నంగా సీజన్ 1, 2కంటే కలర్ ఫుల్‌గా ఉంటుందనే సదరు పార్టిసిపెంట్ తన అభిప్రాయం వ్యక్తం పరిచాడు. మూడో సీజన్లో కంటెస్టెంట్స్ విషయానికొస్తే.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆమె ఈ షోకి ప్రత్యేక ఆకర్షణ కాగలదని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. అలానే జనసేన నాయకుడు, నటుడు నాగబాబు కూడా బిగ్ బాస్‌లో ఉంటే బాగుంటుందన్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో ఓ సీనియర్ ఫిగర్ ఒకరు ఉండాలి. నాగబాబు అటు రాజకీయాల పరంగా.. ఇటు టెలివిజన్ పరంగా అందరికీ తెలిసిన వ్యక్తి. ఈ మధ్య కాలంలో ఆయన చాలా పాపులర్ ఫిగర్‌గా మారారు. కాబట్టి నాకు బిగ్ బాస్ 3లో శ్రీరెడ్డి, నాగబాబు ఇద్దరూ ఉంటే షో నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనేది తన కోరిక అంటూ ఉచిత సలహాల చిట్టా విప్పాడు. మరి ఈ మాజీ పార్టిసిపెంట్ సలహాలను ‘మా’ యాజమాన్యం ఎంత వరకు స్వీకరిస్తుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:June 14, 2019, 12:07 IST