హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu: మంచు విష్ణు అలాంటి రూల్ పెట్టబోతున్నారా ? ప్రకాశ్ రాజ్ మాటలకు అర్థమేంటి ?

Manchu Vishnu: మంచు విష్ణు అలాంటి రూల్ పెట్టబోతున్నారా ? ప్రకాశ్ రాజ్ మాటలకు అర్థమేంటి ?

అన్యాయంగా జరిగిందని.. లోపల ఏదో అక్రమాలు జరిగిపోయాయని ఆరోపించడం తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు విష్ణు. ఆ రోజు రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు కౌంటింగ్ కొనసాగించారని.. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని క్లారిటీ ఇచ్చాడు మా అధ్యక్షుడు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం 'మా' సభ్యుల హక్కని మంచు విష్ణు తెలిపాడు.

అన్యాయంగా జరిగిందని.. లోపల ఏదో అక్రమాలు జరిగిపోయాయని ఆరోపించడం తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు విష్ణు. ఆ రోజు రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు కౌంటింగ్ కొనసాగించారని.. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని క్లారిటీ ఇచ్చాడు మా అధ్యక్షుడు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం 'మా' సభ్యుల హక్కని మంచు విష్ణు తెలిపాడు.

Prakash Raj: ప్రకాశ్ రాజ్ ఊహిస్తున్నట్టు రాబోయే ఎన్నికల్లో కేవలం తెలుగువాళ్లు మాత్రమే పోటీ చేయాలనే నిబంధనను మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు కొత్తగా తీసుకురాబోన్నారా ? అనే చర్చ జరుగుతోంది.

  మా ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల వరకు మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లోని వారి మధ్య ఈ గొడవలు అని.. ఆ తరువాత తాము అంతా ఒకటేనని మాలోని సభ్యులంతా ప్రకటించారు. అయితే ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఈ రచ్చ ఆగడం లేదు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు కొన్ని కామెంట్స్ చేయగా.. ఎన్నికల్లో ఓడిపోయిన ప్యానల్ నుంచి గెలిచిన వాళ్లు.. తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన నటుడు ప్రకాశ్ రాజ్.. మా సభ్యత్వానికి తాను చేసిన రాజీనామా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  మా అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు తన రాజీనామాను ఆమోదించబోనని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తెలుగువాళ్లు కానివారు మా అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదనే నిబంధనను తీసుకురానని ప్రకటిస్తే.. తాను తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని అన్నారు. కేవలం ఎన్నికల్లో ఒకరిని గెలిపించడం, ఒకరిని ఓడించడం కోసం తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కొనసాగలేనని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. అయితే ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు మా, సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

  ప్రకాశ్ రాజ్ ఊహిస్తున్నట్టు రాబోయే ఎన్నికల్లో కేవలం తెలుగువాళ్లు మాత్రమే పోటీ చేయాలనే నిబంధనను మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు కొత్తగా తీసుకురాబోన్నారా ? అనే చర్చ జరుగుతోంది. దీనికి మంచు విష్ణు ఓకే చెబితే.. ప్రకాశ్ రాజ్ వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని అనుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

  Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..

  Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

  ఇక ఈ రకమైన నిబంధన తీసుకురావాలనే ఉద్దేశ్యం మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఉంటే.. ప్రకాశ్ రాజ్‌ను వచ్చే ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా పోటీ చేయకుండా అడ్డుకోవాలనే ఆలోచన ఆయనకు ఉన్నట్టు భావించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం రావాలంటే.. ప్రకాశ్ రాజ్ వేసిన ప్రశ్నకు మంచు విష్ణు లేదా ఆయన తరపున ఎవరైనా స్పందిస్తేనే క్లారిటీ వస్తుందని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: MAA Elections, Manchu Vishnu, Prakash Raj

  ఉత్తమ కథలు