• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • WILL MAKERS PLAN TO RELEASE VICTORY VENKATESH NARAPPA MOVIE DIRECTLY INTO OTT PLATFORM PK

Venkatesh Narappa: ఓటిటిలో వెంకటేష్ ‘నారప్ప’.. సురేష్ బాబు కీలక నిర్ణయం..?

Venkatesh Narappa: ఓటిటిలో వెంకటేష్ ‘నారప్ప’.. సురేష్ బాబు కీలక నిర్ణయం..?

వెంకటేష్ నారప్ప (Venkatesh Narappa)

Venkatesh Narappa: 2021 మొదటి మూడు నెలలు బాగానే ఉన్నా ఎప్రిల్‌లో కరోనా మళ్లీ వచ్చింది. సెకండ్ వేవ్ మరీ దారుణంగా ఉండటంతో తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ సమయంలో వెంకటేష్ నారప్ప(Venkatesh Narappa) సినిమాను నేరుగా ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

  • Share this:
ఈ రోజుల్లో సినిమాలు విడుదల చేయడం కంటే పెద్ద టాస్క్ మరోటి లేదు. ఎందుకంటే ఏడాది కాలంగా కరోనా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు ప్రపంచ సినిమాను వణికిస్తుంది. అన్ని ఇండస్ట్రీలలోనూ ఇదే పరిస్థితి. కరోనా కారణంగా చాలా సినిమాలు ఆగిపోయాయి. కొన్ని వాయిదా పడ్డాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఎలాగోలా విడుదలై విజయం సాధించాయి. 2021 మొదటి మూడు నెలలు బాగానే ఉన్నా ఎప్రిల్‌లో కరోనా మళ్లీ వచ్చింది. సెకండ్ వేవ్ మరీ దారుణంగా ఉండటంతో తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్స్ ఓపెన్ ఉన్నా కూడా అటు వైపు వెళ్లే రిస్క్ చేయడం లేదు ప్రేక్షకులు. దాంతో పరిస్థితులు చక్కబడిన తర్వాత విడుదల చేద్దాంలే అని కొందరు నిర్మాతలు వేచి చూస్తున్నారు. మరికొందరు మాత్రం ఓటిటిలో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. మంచి రేట్ వస్తే నేరుగా ఆన్‌లైన్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అలా విడులదయ్యాయి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమా కూడా డిజిటల్‌లోనే విడుదల చేయాలని చూస్తున్నారు.

బ్రహ్మోత్సవం తర్వాత మరో సినిమాను డైరెక్ట్ చేయని శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం పరిస్థితులు మరీ దారుణంగా ఉండటంతో నారప్ప సినిమాను నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు నిర్మాత సురేష్ బాబు. వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Venkatesh Narappa,Venkatesh Narappa movie,Venkatesh Narappa movie OTT release,Venkatesh Narappa amazon prime release,Venkatesh Narappa release direct in OTT,telugu cinema,నారప్ప ఓటిటి విడుదల,వెంకటేష్ నారప్ప ఓటిటి విడుదల,అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెంకటేష్ నారప్ప విడుదల
వెంకటేష్ నారప్ప (Venkatesh Narappa)

ధనుష్‌కు రెండోసారి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన 'అసురన్' చిత్రానికి ఇది తెలుగు రీమేక్. కథలో పెద్దగా మార్పులు చేయకుండా ఉన్నదున్నట్లు ఇక్కడ రీమేక్ చేస్తున్నారు శ్రీకాంత్ అడ్డాల. ప్రియమణి ఈ చిత్రంలో హీరోయిన్. మే 14న విడుదల చేయాలని ముందుగా అనుకున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనక్కి తగ్గారు దర్శక నిర్మాతలు. అయితే థియేటర్స్ తెరిచే ఉన్నా ఇప్పుడు విడుదల చేయలేరు.
Venkatesh Narappa,Venkatesh Narappa movie,Venkatesh Narappa movie OTT release,Venkatesh Narappa amazon prime release,Venkatesh Narappa release direct in OTT,telugu cinema,నారప్ప ఓటిటి విడుదల,వెంకటేష్ నారప్ప ఓటిటి విడుదల,అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెంకటేష్ నారప్ప విడుదల
వెంకటేష్ నారప్ప (Venkatesh Narappa)

కొన్ని రోజులు ఆగినా కూడా అప్పుడున్న పోటీకి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే నారప్ప సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని చూస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కులను తీసుకున్నట్లు తెలుస్తుంది. గతేడాది నాని ‘వి’ సినిమా విడుదలైన తర్వాత మరే పెద్ద సినిమా కూడా నేరుగా ఓటిటిలో రాలేదు. మరి ఇప్పుడు వెంకీ సినిమా వస్తుందో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు