టాలీవుడ్ మూవీ లవర్స్, మహేశ్ బాబు (Mahesh babu) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున సర్కారు వారి పాట (Sarkaru Vari Pata) ట్రైలర్ రిలీజైంది. మరికొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్.. మూవీపై అంచనాలను మరింతగా పెంచేసిందని చెప్పొచ్చు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కిందని ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. దర్శకుడు పరశురామ్ (Parasuram) ఈ సినిమాను తన రొటీన్ శైలికి భిన్నంగా తెరకెక్కించాడని మూవీ లవర్స్, ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు డేరింగ్ స్టెప్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో మే నెలలో వచ్చిన మహేశ్ బాబు సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. నిజం, నాని, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు మే నెలలో రిలీజై.. సూపర్ స్టార్ మహేశ్‌కు, ఆయన అభిమానులకు నిరాశనే మిగిల్చాయి. అయితే 2019లో మే 9న వచ్చిన మహర్షి మూవీ మాత్రం మహేశ్ బాబుకు ఉన్న ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది.
ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా వసూళ్లపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అయితే చిత్ర యూనిట్ ప్రకటించినట్టు బ్లాక్ బాస్టర్ కాకపోయినా.. మహేశ్ బాబు మే బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన మూవీగా మహర్షి నిలిచింది. తాజాగా సర్కారు వారి పాట సినిమా కూడా మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుండటంతో.. ఈ సినిమా మహర్షి మూవీని మించి సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు టాలీవుడ్ తీవ్రంగా ఇబ్బందిపడింది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్, రిలీజ్‌ల విషయంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి.
అయితే ఈ ఏడాది సమ్మర్లో కరోనా నుంచి రిలీఫ్ రావడంతో.. పెద్ద హీరోలు సమ్మర్లో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు క్యూ కట్టారు. భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్, రాధేశ్యామ్‌తో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, చిరంజీవి ఆచార్య సినిమాలు ఆడియెన్స్ ముందుకు తమ అదృష్టాన్నీ పరీక్షించుకున్నాయి. అయితే వీటిలో రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి. భీమ్లా నాయక్‌గా వచ్చిన పవన్ కళ్యాణ్ యావరేజ్ మార్కును దాటలేకపోయాడు.
Prabhas - Project K : ప్రాజెక్ట్ K షూటింగ్లో మళ్లీ ప్రారంభం.. ప్రభాస్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ..
అపజయాలు లేని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మాత్రమే ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దీంతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్న సర్కారు వారి పాట రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మూడేళ్ల క్రితం మహర్షి సినిమాతో తన మే బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన సక్సెస్ అందుకున్న మహేశ్ బాబు.. ఈసారి సర్కారు వారి పాటతో అంతకు మించిన విజయాన్ని నమోదు చేస్తాడేమో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata