సూపర్‌స్టార్ మహేశ్‌తో ఎలాగైనా సినిమా చేయాలని ఓ డైరెక్టర్ మరీ పట్టుబట్టి కూర్చునట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వంశీ పైడిపల్లి. గత ఏడాది మహేశ్ 25వ చిత్రం 'మహర్షి'ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశారు. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ వెంటనే మహేశ్ అనీల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేశారు. ఆ సమయంలో వంశీ పైడిపల్లి మరోసారి మహేశ్‌తో సినిమ ఆచేయడానికి ఓ పాయింట్ అనుకుని మహేశ్‌కు చెప్పాడు. పాయింట్ నచ్చడంతో కథను డెవలప్ చేయమని చెప్పాడు మహేశ్. తదుపరి ఎలాగైనా మహేశ్‌తో సినిమా చేయాలని కథను తయారు చేశాడు వంశీ పైడిపల్లి. అయితే ఆ కథ మహేశ్‌కు నచ్చలేదు. దాంతో వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్‌ని మహేశ్ పక్కన పెట్టేశాడు. పరశురాంతో సర్కారువారి పాట సినిమాను చేయడానికి రెడీ అయిపోయాడు. అయితే వంశీ పైడిపల్లి మాత్రం ఎలాగైనా మహేశ్‌తోనే సినిమా చేయాలని చాలా గట్టిగా అనుకుంటున్నట్లు ఉన్నాడు.
ఎందుకంటే తాజా సమాచారం మేరకు మహేశ్ కోసం మరో కథను తయారు చేసే పనిలో ఉన్నాడట వంశీ పైడిపల్లి. మహేశ్ సర్కారు వారి పాట పూర్తి చేసిన తర్వాత రాజమౌళి సినిమాను చేస్తాడు. ఈ సినిమాను చేసే గ్యాప్‌లో మహేశ్‌తో సినిమా చేయడానికి వంశీ పైడిపల్లి ప్లాన్ చేసుకున్నాడట. అందుకు తగినట్లే ఇప్పుడు కథను తయారు చేసే పనిలో ఉన్నాడట. ఎలాగైనా ఈసారి మహేశ్‌తో ఓకే చెప్పించుకోవాలనేది వంశీ పైడిపల్లి ఆలోచనగా కనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
మహేశ్,పరశురాం కాంబినేషన్లో రూపొందనున్న 'సర్కారువారి పాట' సినిమా జనవరి నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ముందు ఇండియాలో చిత్రీకరించాల్సిన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసి తర్వాత యు.ఎస్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. కీర్తిసురేశ్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharshi, Mahesh babu, Vamsi paidipally