హోమ్ /వార్తలు /సినిమా /

Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

అన్యాయంగా జరిగిందని.. లోపల ఏదో అక్రమాలు జరిగిపోయాయని ఆరోపించడం తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు విష్ణు. ఆ రోజు రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు కౌంటింగ్ కొనసాగించారని.. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని క్లారిటీ ఇచ్చాడు మా అధ్యక్షుడు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం 'మా' సభ్యుల హక్కని మంచు విష్ణు తెలిపాడు.

అన్యాయంగా జరిగిందని.. లోపల ఏదో అక్రమాలు జరిగిపోయాయని ఆరోపించడం తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు విష్ణు. ఆ రోజు రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు కౌంటింగ్ కొనసాగించారని.. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని క్లారిటీ ఇచ్చాడు మా అధ్యక్షుడు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం 'మా' సభ్యుల హక్కని మంచు విష్ణు తెలిపాడు.

Maa Elections 2021: మా అధ్యక్షుడిగా పోటీ చేసిన నటుడు ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. తన గెలుపు కోసం అనేక హామీలు ఇచ్చిన మంచు విష్ణు.. అదే సమయంలో ప్రకాశ్ రాజ్‌ను ఓడించేందుకు ఆయన నాన్ లోకల్ అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు.

ఇంకా చదవండి ...

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంత పెద్దదేమీ కాదు. మా ఎన్నికల సందర్భంగా పోటీ చేసిన వాళ్లు, తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన వాళ్లు పదే పదే చెప్పిన మాటలివి. వాళ్లు చెప్పింది నిజమే అయినా.. సినీ రంగం ప్రభావం మాత్రం కోట్లాది మందిపై ఉంటుంది. రంగుల ప్రపంచంలో జరిగే పరిణామాలను సినీ ప్రియులంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. మా ఎన్నికల రచ్చ ఇంత హైలెట్ కావడానికి కూడా ఇదే అసలు కారణం. ఈ ఎన్నికల్లో తలెత్తిన వివాదాలు ఇంకా సమసిపోలేదు. అయితే ఈ ఎన్నికల ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఏ మేరకు ఉంటుందనే అంశంపై చర్చ మొదలైంది.

వినడానికి ఇది కాస్త వింతగానే ఉన్నా.. ఎన్నికల నాటికి ఈ మా (MAA) ఎన్నికల్లో జరిగిన సంఘటనలు రాజకీయాల్లో ప్రస్తావనకు రావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. మా అధ్యక్షుడిగా పోటీ చేసిన నటుడు ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు(Prakash Raj)  విజయం సాధించారు. తన గెలుపు కోసం అనేక హామీలు ఇచ్చిన మంచు విష్ణు.. అదే సమయంలో ప్రకాశ్ రాజ్‌(Prakash Raj) ను ఓడించేందుకు ఆయన నాన్ లోకల్ అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని మంచు విష్ణు ఎక్కువగా ప్రస్తావించకపోయినప్పటికీ.. ఆయనకు మద్దతుగా నిలిచిన నరేశ్, రవిబాబు వంటి వాళ్లు మాత్రం ఈ అంశాన్ని పలుసార్లు లేవనెత్తారు.

NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సారథ్యం వహించేందుకు తెలుగువాళ్లు లేరా ? అంటూ కొత్త నినాదం తెరపైకి తీసుకొచ్చారు. ఇదే తన ఓటమికి కారణమంటూ మా సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు ప్రకాశ్ రాజ్. అయితే మా ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ప్యానల్ లేవనెత్తిన లోకల్ నినాదం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయాల్లో తమ ప్రత్యర్థులను ఇరుకునపెట్టేందుకు నేతలు ఏదైనా చేస్తుంటారు. అలాంటి వాళ్లు మా ఎన్నికలను ప్రస్తావిస్తూ.. లోకల్ నినాదం తెరపైకి తెచ్చే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Manchu Vishnu: మంచు విష్ణు అలాంటి రూల్ పెట్టబోతున్నారా ? ప్రకాశ్ రాజ్ మాటలకు అర్థమేంటి ?

అయితే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఈ నివాదం ఆయా రాష్ట్రాల్లో మళ్లీ పని చేసే అవకాశం ఉండకపోవచ్చనే వాదన కూడా ఉంది. అయితే స్థానికంగా పోటీ చేసే నేతలు.. తమ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు ఈ అంశాన్ని ప్రస్తావించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి మా ఎన్నికల్లో తెరపైకి వచ్చిన లోకల్ నినాదం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: MAA Elections, Manchu Vishnu, Prakash Raj

ఉత్తమ కథలు