శ్రీరెడ్డి చిరకాల వాంఛ.. కత్తి మహేష్ తీర్చబోతున్నాడా?

కత్తి మహేష్, శ్రీరెడ్డి

ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఓ సినిమాను డైరెక్ట్ చేయడానికి కథ రెడీ చేసుకుంటున్నాడు.

  • Share this:
    వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఇద్దరు వ్యక్తులు శ్రీరెడ్డి, కత్తి మహేష్. అయితే, ఎప్పుడూ వేర్వేరుగా వార్తల్లో నిలిచే వారిద్దరూ ఇప్పుడు ఒకేసారి హాట్ టాపిక్‌గా మారబోతున్నారు. ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మెగాఫోన్ పట్టబోతున్నాడు. ప్రస్తుతం అతడు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఓ సినిమాను డైరెక్ట్ చేయడానికి కథ రెడీ చేసుకుంటున్నాడు. అది కూడా చివరిదశకు వచ్చినట్టు తెలిసింది. ఈ స్టోరీకి ఇంతవరకు టీమ్‌ను సెలక్ట్ చేయలేదు. అయితే, కత్తి మహేష్ సంచలన నిర్ణయం తీసుకుని.. తన సినిమాలో శ్రీరెడ్డికి కీ రోల్ ఇస్తాడా? అనే చర్చ ఆయనకు సన్నిహితవర్గాల్లో జరుగుతోంది.

    సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి.. తనను ఎంతోమంది వాడుకుని మోసం చేశారంటూ శ్రీరెడ్డి ఆరోపణ. తనకు సినిమాల్లో నటించాలని ఎంతో కసితో ఉంది. అయితే, ఏదో అలా స్క్రీన్ మీద కొద్దిసేపు కనిపించి మాయం అయ్యే సీన్లే కానీ, ఎక్కడా పూర్తిస్థాయిలో సినిమా క్యారెక్టర్ దక్కలేదు. ఈ క్రమంలో కత్తిమహేష్ దర్శకత్వం వహించబోయే సినిమాలో శ్రీరెడ్డికి అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తాడా?, లేకపోతే సినిమా వేరు, ఫ్రెండ్‌షిప్ వేరు అంటూ హ్యాండిస్తాడా? అని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.
    First published: