సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు, విడాకులు సర్వసాధారణం అయిపోయాయి. ఇవేవో 2020లో జరుగుతున్న వింతలేవీ కావు. 1990,80లో కూడా చాాలా జంటలు ఇలానే విడిపోయాయి. ఇక ఇప్పుడు కూడా చాలామంది సెలబ్రిటీలు.. తమ వివాహ బంధానికి చెక్ పెట్టేస్తున్నారు. ఆ లిస్ట్ చెప్పుకుంటూ పోతే.. టాలీవుడ్,కోలీవుడ్, బాలీవుడ్ వరకు చాంతాడంతా లిస్ట్ ఉంటుంది. అయితే విడాకులు తీసుకున్నాక చాలామంది సింగిల్ లైఫ్ లీడ్ చేస్తుంటే.. మరికొందరు సినీ ప్రముఖులు మాత్రం రెండు,మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. ఇలా వరుస పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిలో హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా ఉంటున్నారు.
తాజాగా మరో హీరోయిన్ రెండో పెళ్లికి సిద్ధమవుతోంది. మొదటి భర్తకు విడాకులిచ్చిన ఆమె.. మరోసారి మూడు ముళ్లు వేసుకునేందుకు రెడీ అవుతోంది. ఆమె ఇంకెవరో కాదు. బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ భామ అతి తక్కువ కాలంలోనే వెండితెరపై స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. 1991 లో వచ్చిన ప్రేమ్ ఖైదీ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. 1974 జూన్ 25న పుట్టిన ఈ భామ వయసు ప్రస్తుతం 47ఏళ్లు. ముంబైలో పుట్టి పెరిగిన కరిష్మా... బాలీవుడ్లో వరుసగా హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇక చెల్లి కరీనా కపూర్ తో పాటు కరిష్మా చేసే అల్లరి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అందరికి తెలిసిందే. ఇక నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు దగ్గరగా ఉండే ఈ ముద్దుగుమ్మ 2003 లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను వివాహమాడింది. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 2016 లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ కుమారుడు, ఓకూతురు ఉన్నారు. భర్తతో విడాకులు తర్వాత కరిష్మా పిల్లలిద్దరితో కలిసి వేరేగా నివసిస్తోంది.
ఇక విడాకుల అనంతరం కరిష్మా రెండో పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు గుప్పమంటున్న విషయం విదితమే. ఇక తాజాగా ఆమె రెండో పెళ్లిపై నోరు విప్పింది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానిలతో చిట్ చాట్ సెషన్ నిర్వహించగా ఒక అభిమాని ” మీరు రెండో పెళ్లి చేసుకుంటారా” అని అడుగగా వెంటనే తడుముకోకుండా ” చేసుకొంటానేమో ” అని చెప్పుకొచ్చింది. దీంతో త్వరలోనే ఈ భామ రెండో పెళ్లి చేసుకోనున్నదని క్లారిటీ వచ్చేసింది. మరి కరిష్మా చేసుకోబోయే వ్యక్తి సినిమా రంగానికి చెందినవాడో .. వ్యాపారరంగానికి చెందినవాడో చూడాలి .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Kareena Kapoor