జబర్దస్త్‌లోకి రోజా రీ ఎంట్రీ.. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌కు టెన్షన్?

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ నాగబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆ విషయాన్ని రోజా మనసులో పెట్టుకుంటారా?

news18-telugu
Updated: April 27, 2019, 5:24 PM IST
జబర్దస్త్‌లోకి రోజా రీ ఎంట్రీ.. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌కు టెన్షన్?
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రోజా (Jabardasth Show Roja Sudigali Sudheer Hyper Aadi)
  • Share this:
జబర్దస్త్‌లోకి రోజా రీ ఎంట్రీ ఇచ్చింది. మూడు వారాల తర్వాత మళ్లీ బుల్లితెర కామెడీ షోలో జడ్జిగా దర్శనమివ్వబోతోంది. వచ్చేవారం ప్రసారమ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో జడ్జిగా రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే, ఇప్పుడు జబర్దస్త్ షో వీక్షకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక సందేహం వచ్చింది. గతంలో జబర్దస్త్ జడ్జిగా రోజా, నాగబాబు ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. ఎన్నికలు రావడంతో రోజా వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నాగబాబు జనసేన తరఫున నర్సాపురం ఎంపీగా పోటీ చేశారు. అయితే, జబర్దస్త్ షోలో పాల్గొనే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ రెండు టీమ్‌లు నాగబాబు తరఫున, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. జబర్దస్త్ షో నుంచి ఎవరూ రోజా తరఫున ప్రచారం చేయలేదు.

Jabardasth Comedy Show,Roja Re entry into Jabardasth,Jabardasth Judge Roja,YSRCP MLA Roja,Roja reentry into Jabardasth,Extra Jabardasth,Nagababu Jabardasth Reentry,Nagababu vs Roja,Roja vs Nagababu,Roja Sudigali Sudheer,Roja vs Hyper Aadi,Hyper Aadi Election campaign,Sudigali Sudheer Election Campaign,Roja Revenge on Hyper aadi,Roja Revenga on Sudigali Sudheer,Jabardasth Latest,Jabardasth news,Telugu News,రోజా వర్సెస్ హైపర్ ఆది,రోజా వర్సెస్ సుడిగాలి సుధీర్,రోజా జబర్దస్త్లోకి రీ ఎంట్రీ,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ రోజా,జబర్దస్త్ అనసూయ,జబర్దస్త్ రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ బర్త్‌డే,Jabardasth Anchor Anasuya,Jabardasth Anchor Rashmi Gauthm birhtday,రష్మి పుట్టినరోజు
జనసేనకు జబర్దస్త్ టీం ప్రచారం

ఇప్పుడు రోజా రీ ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు ఇంకా రీ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఎవరూ తనకు మద్దతుగా ప్రచారం చేయలేదన్న విషయాన్ని రోజా మనసులో పెట్టుకుంటారా? ఆ ప్రభావం జబర్దస్త్ జడ్జిగా ఉన్న ఆమె మీద పడుతుందా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మీద పంచ్‌లు వేయడంలో రోజా దిట్ట. పంచ్‌కు పంచ్ ఇస్తుందా? అనేది చూడాలి.

Jabardasth Comedy Show,Roja Re entry into Jabardasth,Jabardasth Judge Roja,YSRCP MLA Roja,Roja reentry into Jabardasth,Extra Jabardasth,Nagababu Jabardasth Reentry,Nagababu vs Roja,Roja vs Nagababu,Roja Sudigali Sudheer,Roja vs Hyper Aadi,Hyper Aadi Election campaign,Sudigali Sudheer Election Campaign,Roja Revenge on Hyper aadi,Roja Revenga on Sudigali Sudheer,Jabardasth Latest,Jabardasth news,Telugu News,రోజా వర్సెస్ హైపర్ ఆది,రోజా వర్సెస్ సుడిగాలి సుధీర్,రోజా జబర్దస్త్లోకి రీ ఎంట్రీ,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ రోజా,జబర్దస్త్ అనసూయ,జబర్దస్త్ రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ బర్త్‌డే,Jabardasth Anchor Anasuya,Jabardasth Anchor Rashmi Gauthm birhtday,రష్మి పుట్టినరోజు
జనసేన కోసం హైపర్ ఆది ప్రచారం

అసలు రోజా మీద అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకు వారు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. వైసీపీ నేతగా, ఎమ్మెల్యేగా రోజా.. గతంలో ప్రజారాజ్యం మీద, చిరంజీవి మీద, పవన్ కళ్యాణ్ మీద ఎన్నో విమర్శలు చేశారు. ఆ రాజకీయ వైరం పొలిటికల్ స్క్రీన్ వరకే పరిమితం చేశారు. జబర్దస్త్‌లో జడ్జిలుగా రోజా, నాగబాబు అద్భుతంగా పనిచేశారు. తమ రాజకీయ వైరుధ్యాలు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుందని, రోజా మీద అనవసర అబాంఢాలు వేయాల్సిన పనిలేదని మరికొందరు చెబుతున్నారు.
First published: April 27, 2019, 5:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading