బాలీవుడ్‌కు అనసూయ భరద్వాజ్‌.. ఉత్తరాదిన బంపర్ ఆఫర్..

Anasuya Bharadwaj: తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి అనసూయ భరద్వాజ్. అటు యాంకర్‌గానే కాకుండా ఇటు నటిగా కూడా సత్తా చూపిస్తుంది. వరస సినిమాలతో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 10, 2020, 11:16 PM IST
బాలీవుడ్‌కు అనసూయ భరద్వాజ్‌.. ఉత్తరాదిన బంపర్ ఆఫర్..
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj hot)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి అనసూయ భరద్వాజ్. అటు యాంకర్‌గానే కాకుండా ఇటు నటిగా కూడా సత్తా చూపిస్తుంది. వరస సినిమాలతో పాటు వరసగా టివి షోలు కూడా చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటి వరకు తెలుగు తప్ప మరో భాషలోకి వెళ్లలేదు అనసూయ. తమిళంలో కూడా నటించాలని ఉందని.. అయితే అక్కడ్నుంచి మంచి అవకాశాలు రావడం లేదని చెప్పుకొచ్చింది అనసూయ. మధ్యలో ఒకట్రెండు ఆఫర్స్ వచ్చినా కూడా అవి అంతగా ఆకట్టుకోలేదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అందుకే తెలుగులోనే తన ప్రయాణం అంటుంది అనసూయ.
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)


అయితే ఇప్పుడు మాత్రం ఈమెకు బాలీవుడ్ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. త్వరలోనే బాలీవుడ్‌లో కూడా అనసూయ ఫేమస్ కానుందనే ప్రచారం జరుగుతుంది. అక్కడ సినిమా కాదు కానీ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చిందని.. ఓ టాప్ రేటెడ్ సీరియల్ కోసం అనసూయను అడిగారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు అనసూయ సీరియల్స్ అయితే చేయలేదు. అన్నీ టీవీ షోలు చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు పాత్ర బాగుండటంతో బాలీవుడ్ సీరియల్‌లో నటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది.
అనసూయ భరద్వాజ్ బికినీ (anasuya bharadwaj bikini)
అనసూయ భరద్వాజ్ బికినీ (anasuya bharadwaj bikini)

పైగా సినిమాల్లో కూడా కీలక పాత్రలు వస్తున్నాయి. ఇప్పుడు హిందీ సీరియల్‌లో మెయిన్ లీడ్ చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. తక్కువ రోజులే డేట్స్ అడగడంతో ఈమె కూడా ఒప్పుకుందనే ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ సీరియల్‌లో అనసూయ పాత్ర ముగుస్తుందని.. కానీ చిన్న పాత్రే అయినా కూడా మెయిన్ లీడ్ కావడంతో ఒప్పుకుందని తెలుస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తెలుగులో చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు మరో రెండు మూడు క్రేజీ సినిమాల్లోనూ నటిస్తుంది అనసూయ. ఇప్పుడు బాలీవుడ్ కూడా వెళ్తే అమ్మడు దశ తిరిగిపోయినట్లే.
First published: May 10, 2020, 11:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading