WILL HOT ANCHOR MANJUSHA HOST THE JABARDASTH COMEDY SHOW AFTER THE LOCKDOWN PK
జబర్దస్త్‌కు కొత్త యాంకర్.. అనసూయ, రష్మిలలో ఒకరు ఔట్..?
రష్మి గౌతమ్, అనసూయ
Jabardasth Comedy Show: జబర్దస్త్ కామెడీ షోలో గతేడాది నుంచి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఉన్న కమెడియన్లు కొందరు బయటికి వెళ్ళిపోయారు.. నాగబాబు కూడా అడ్రస్..
జబర్దస్త్ కామెడీ షోలో గతేడాది నుంచి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఉన్న కమెడియన్లు కొందరు బయటికి వెళ్ళిపోయారు.. నాగబాబు కూడా అడ్రస్ మార్చుకున్నాడు. ఇప్పుడు మరో మార్పు కూడా జరగబోతుందని తెలుస్తుంది. ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ రేటింగ్ ఈ స్థాయిలో ఉందంటే కారణం కమెడియన్లు, జడ్జిలతో పాటు యాంకర్స్ కూడా. అనసూయ, రష్మి గౌతమ్ తమ అందాలతో షో రేటింగ్ పడిపోకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు. మధ్యలో కొన్ని నెలల పాటు అనసూయ కనిపించకుండా పోయినా కూడా రష్మి అన్నీ తానేయై ముందుకు నడిపించింది.
రష్మి గౌతమ్, అనసూయ (anasuya rashmi gautam)
ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్స్ వరకు వర్షిణి, శ్రీముఖి లాంటి వాళ్లు వచ్చారు. అయితే ఎప్పుడూ వాళ్లు మాత్రం తమ స్థానం నుంచి పక్కకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు అనసూయ, రష్మి గౌతమ్లలో ఒకరు బయటికి వెళ్లిపోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరిలో ఒకరు లాక్డౌన్ తర్వాత జబర్దస్త్ కామెడీ షో మానేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఓ హాట్ యాంకర్ ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి. లాక్డౌన్ తర్వాత ప్రసారం అయ్యే ఎపిసోడ్స్‌కు సీనియర్ యాంకర్ మంజూష వస్తున్నట్లు తెలుస్తుంది.
సీనియర్ యాంకర్ మంజూష (anchor manjusha)
ఇదివరకే హైపర్ ఆది స్కిట్లో ఒకసారి కనిపించింది మంజూష. అప్పుడు కంటెస్టెంట్‌గా జస్ట్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా యాంకర్‌గా వచ్చేస్తుందని తెలుస్తుంది. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కి చెల్లెలుగా నటించిన మంజూషకు నటిగా సక్సెస్ రాలేదు కానీ యాంకర్‌గా మాత్రం పర్లేదు అనిపించింది. పైగా ఈ మధ్య హాట్ హాట్ షో చేస్తూ అందరి కళ్లలో పడుతుంది మంజూష.
అనసూయ, యాంకర్ మంజూష (anasuya manjusha)
ఈ గ్లామర్ షోతోనే జబర్దస్త్ ఆఫర్ అందుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అంతా బాగానే ఉంది కానీ మంజూష వస్తే అనసూయ, రష్మిలలో ఎవరు మానేస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అసలు ఇది నిజమేనా.. లేదంటే అనుకోకుండా వచ్చిన రూమరా అనేది అర్థం కావట్లేదు అభిమానులకు. దీనికి సమాధానం తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.