కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ కోసం శంకర్ రూటు మార్చాడా ?

‘భారతీయుడు2’ విడుదలైన 22 యేళ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్‌లు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఇండియన్2’ చేస్తున్నారు. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ సీక్వెల్ కోసం శంకర్ తన డైరెక్షన్ పంథాను మార్చుకోబోతున్నట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 15, 2019, 1:09 PM IST
కమల్ హాసన్ ‘ఇండియన్ 2’  కోసం శంకర్ రూటు మార్చాడా ?
కమల్ హాపన్, శంకర్
  • Share this:
శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ సినిమా అప్పట్లో భారీ సక్సెస్‌ను నమోదు చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ‘భారతీయుడు2’ విడుదలైన 22 యేళ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్‌లు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఇండియన్2’ చేస్తున్నారు. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు.

అంతేకాదు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ జవవరి 18న పొలాచ్చిలో ‘ఇండియన్ 2’ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆ తర్వాత చెన్నై, యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఐతే ఈ సినిమాను కేవలం నాలుగు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్  కానుకగా మేలో ‘ఇండియన్2’ విడుదల చేసేలా శంకర్ ప్లాన్ చేస్తున్నాడట.

కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ కోసం శంకర్ రూటు మార్చాడా ?, Will Directror Shankar To Change His Film Making for Kamal haasan Indian 2
‘ఇండియన్ 2’ లో కమల్ హాసన్


శంకర్ గత చిత్రాలను చూస్తే...ఈ సినిమాను తీసుకున్న ఏళ్లకు చెక్కడం అలవాటైపోయింది. రీసెంట్‌గా రిలీజైన రజినీకాంత్, అక్షయ్ కుమార్‌ల ‘2.O’ సినిమాను పూర్తి చేయడానికి దాదాపు మూడేళ్ల టైమ్ తీసుకున్నాడు. అందుకే ఇపుడు కమల్ హాసన్‌తో చేయబోయే ‘ఇండియన్2’ సినిమాలో ఎక్కువ గ్రాఫిక్స్ లేకుండా తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ కోసం శంకర్ రూటు మార్చాడా ?, Will Directror Shankar To Change His Film Making for Kamal haasan Indian 2
భారతీయుడు సెట్స్‌లోొ కమల్ హాసన్‌కు సూచనలు వస్తోన్న శంకర్


‘శివాజీ’ తర్వాత పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడ్డ శంకర్..ఈ సినిమా కోసం కథను నమ్ముకొని రంగంలోకి దిగడం విశేషం. ప్రస్తుతం కమల్ హాసన్..‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అధినేతగా రాజకీయాల్లో ఉంటడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ కోసం శంకర్ రూటు మార్చాడా ?, Will Directror Shankar To Change His Film Making for Kamal haasan Indian 2
‘ఇండియన్ 2’ ఫస్ట్ లుక్
కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శింబు, దుల్కర్ సల్మాన్‌ ఇంపార్టెంట్ రోల్స్  ప్లే చేయనున్నట్టు సమాచారం. మరోవైపు బాలీవుడ్ అగ్రనటులు అక్షయ్ లేదా అజయ్ దేవ్‌గణ్ ఈసినిమాలో విలన్‌గా నటించే అవకాశాలున్నాయి.

కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ కోసం శంకర్ రూటు మార్చాడా ?, Will Directror Shankar To Change His Film Making for Kamal haasan Indian 2
భారతీయుడు‌లో కమల్ హాసన్


‘భారతీయుడు2’ కమల్ హాసన్ సినిమాలకు పుల‌్‌స్టాప్ ఇచ్చి  తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తారట. అందుకే ఈసినిమాను తొందరగా షూటింగ్ కానిచ్చే పనిలో పడ్డాడు శంకర్. ఈ సినిమా తర్వాత శంకర్..హృతిక్ రోషన్‌తో బాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి 

‘బాహుబలి’ తర్వాత ఆ రికార్డ్ ‘కేజియఫ్‌’కే సాధ్యం.. భళా యశ్..

కెవ్వుకేక పుట్టిస్తోన్న కమల్ హాసన్, విక్రమ్‌ల ‘కదరమ్ కొండమ్’ టీజర్

కమల్ హాసన్ లాస్ట్ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..

 
First published: January 15, 2019, 12:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading