దీపిక తల్లి కాబోతుందా.. సోషల్ మీడియాలో సంచలనం..

Deepika Padukone: ఏమో ఇప్పుడు ఇవే వార్తలు బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు దీపిక తల్లి కాబోతుందనే ప్రచారం భారీగానే జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 4, 2020, 4:58 PM IST
దీపిక తల్లి కాబోతుందా.. సోషల్ మీడియాలో సంచలనం..
రణ్‌వీర్, దీపిక (Ranveer singh Deepika)
  • Share this:
ఏమో ఇప్పుడు ఇవే వార్తలు బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు దీపిక తల్లి కాబోతుందనే ప్రచారం భారీగానే జరుగుతుంది. రెండేళ్ల కింద బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపిక. కొన్ని రోజులుగా సినిమాలు కూడా చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఒకట్రెండు సినిమాలు చేస్తున్నా కూడా తన షెడ్యూల్స్‌కు అనుగుణంగానే వాటి షూటింగ్ జరుగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన  ఫోటో ఒకటి సంచలనం రేపుతుంది. ముఖ్యంగా ఆమె తల్లి కాబోతుందనే వార్తలకు బీజం వేస్తుంది.

అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోయి హాయిగా భర్తకు వంటలు చేసి పెడుతుంది దీపిక. అందులో భాగంగానే కొన్ని కొత్త వంటలు కూడా ట్రై చేస్తుంది. అప్పుడప్పుడూ వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈమె పచ్చి మామిడికాయ్ ముక్కలను కోసి.. కారం పెట్టి ఆ పోటోలను షేర్ చేసింది. దాంతో ఈమె తల్లి అవుతున్నావా.. శుభవార్త ఎప్పుడు చెప్తున్నావ్ అంటూ అంతా ఆమెను అడుగుతున్నారు. మామిడికాయ్ తింటున్నావ్ అంటే అదేగా అంటున్నారు మరికొందరు. దీనిపై రణ్‌వీర్, దీపిక మాత్రం నోరు విప్పడం లేదు.
Published by: Praveen Kumar Vadla
First published: May 4, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading