పద్మావత్ తర్వాత మరో బయోపిక్‌లో దీపికా

ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపికా.. 32 ఏళ్ల యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ పాత్రలో నటించబోతున్నట్టు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి.  

news18-telugu
Updated: October 5, 2018, 2:04 PM IST
పద్మావత్ తర్వాత మరో బయోపిక్‌లో దీపికా
దీపిక పదుకొనే ట్విట్టర్ ఫోటో
  • Share this:
‘పద్మావత్’ మూవీ తర్వాత విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో లేడీ డాన్ స్వప్నా దీదీ క్యారెక్టర్ చేయడానికి దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈ మూవీలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తోన్న ఇర్ఫార్ ఖాన్..అనారోగ్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.

మరోవైపు దీపికా..రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకోబోతున్న కారణంగా సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్టు ముంబాయి ఫిల్మ్ వర్గాల్లో పుకార్లు షికార్లు చేసినుండే. ఐతే..ఆ పుకార్లకు పులిస్టాప్ పెడుతూ దీపికా తన నెక్ట్స్ మూవీకి సైన్ చేసిందట. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపికా.. 32 ఏళ్ల యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ పాత్రలో నటించబోతున్నట్టు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు ఒక వ్యక్తి కారణంగా చితికిపోయిన ఓ మహిళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ మూవీకి దీపికా  నిర్మాతగా వ్యవహరించడానికి ముందుకొచ్చింది. ఈ విషయాన్ని దీపికా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఒక మహిళ పోరాటానికి సంబంధించిన స్టోరీ మాత్రమే కాదు. ఒక మహిళ ఆశ, ఆశయాలకు అనుగుణంగా సాగే కథ. అందుకే ఈ సినిమా చేయడంతో పాటు నిర్మాతగా వ్యవహరించడానికి ముందుకొచ్చానని దీపికా తెలిపారు.

2005లో లక్ష్మి దిల్లిలోని ఓ బస్టాప్‌లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకోలేదున్న ఒకే ఒక్క కారణంతో ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడి జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో యాసిడ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 5, 2018, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading