హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi: క్లైమాక్స్‌కు చేరుకుంటున్న మా ఎన్నికలు.. లాస్ట్ పంచ్ మెగాస్టార్‌దేనా.. ఆయన మాటలకు అర్థమేంటి ?

Chiranjeevi: క్లైమాక్స్‌కు చేరుకుంటున్న మా ఎన్నికలు.. లాస్ట్ పంచ్ మెగాస్టార్‌దేనా.. ఆయన మాటలకు అర్థమేంటి ?

5. బయట మనం అందంగా కనిపించాలంటే లోపల కూడా కచ్చితంగా ప్రశాంతంగా ఉండాలి. ఫిజికల్ ఫిట్‌నెస్‌ ఎంత ముఖ్యమో.. మెంటల్ గా కూడా అంత దూరంగా ఉండడం చిరంజీవికి ఉన్న ప్రత్యేక గుణం. వీలైనంత వరకు మానసిక ప్రశాంతత కోసం చిరంజీవి సుదూర ప్రాంతాలకు వెళ్తుంటాడు.

5. బయట మనం అందంగా కనిపించాలంటే లోపల కూడా కచ్చితంగా ప్రశాంతంగా ఉండాలి. ఫిజికల్ ఫిట్‌నెస్‌ ఎంత ముఖ్యమో.. మెంటల్ గా కూడా అంత దూరంగా ఉండడం చిరంజీవికి ఉన్న ప్రత్యేక గుణం. వీలైనంత వరకు మానసిక ప్రశాంతత కోసం చిరంజీవి సుదూర ప్రాంతాలకు వెళ్తుంటాడు.

MAA Elections 2021: ప్రకాశ్ రాజ్ వెనుక చిరంజీవి.. మంచు విష్ణు వెనుక మోహన్ బాబు ఉండటంతో.. మా ఎన్నికల చాటున మరోసారి టాలీవుడ్‌లో చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అన్న పరిస్థితి నెలకొందనే టాక్ కూడా వినిపిస్తోంది.

మరికొద్ది రోజుల్లోనే జరగనున్న మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలపై సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. పోటీలో ఉన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు మధ్య మాటల యుద్ధం.. అందులోనూ ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య డైలాగ్ వార్ రోజురోజుకు పతాకస్థాయికి చేరుకుంటోంది. ఇక సినీ రంగంలోని ప్రముఖుల మద్దతు కోరుతూ మంచు విష్ణు తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజులను కలిసి మద్దతు కోరారు. ఓ వైపు సినీ ప్రముఖల మద్దతు కోరుతూనే మరోవైపు ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు.

మంచు విష్ణు దూకుడు చూస్తున్న కొందరు.. ఈసారి ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించే అవకాశం లేకపోలేదని అనుకుంటున్నారు. ఈ సమయంలోనే ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగడం కొత్త చర్చకు తెరలేపింది. ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా నిలిచిన నాగబాబు.. మంచు విష్ణు ప్యానల్‌కు మద్దతుగా నిలుస్తున్న నరేశ్ వంటి పలువురిపై సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు.

ఈసారి మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తారని చిరంజీవి చెప్పడంతో.. అందుకు అతడు సరైన వ్యక్తి అని తాను అభిప్రాయపడ్డానని నాగబాబు తెలిపారు. ఈ రకంగా ప్రకాశ్ రాజ్‌కు చిరంజీవి నుంచి సంపూర్ణ మద్దతు ఉందనే విషయాన్ని నాగబాబు వెల్లడించారు. మా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ప్రకాశ్ రాజ్‌ మద్దతుగా నాగబాబు రంగంలోకి దిగడంతో.. చిరంజీవి అండ్ మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతుందనే ఊహాగానాలు నెలకొన్నాయి.

గతంలోనూ మెగా ఫ్యామిలీ మద్దతు ఉన్న వాళ్లు మా ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా మెగా ఫ్యామిలీ మద్దతు ఉన్న ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనే చర్చ కూడా సాగుతోంది.

Naga Babu - MAA Elections: మంచు విష్ణును గెలిపించడానికి మీకేంటి కంగారు.. ఓటుకి 10 వేలు ఇస్తున్నారంటున్న నాగబాబు..

MAA Elections : మా ఫ్యామిలీని లాగోద్దు.. ప్రకాష్ రాజ్‌కు మంచు విష్ణు వార్నింగ్...

మరోవైపు ప్రకాశ్ రాజ్ వెనుక చిరంజీవి.. మంచు విష్ణు వెనుక మోహన్ బాబు ఉండటంతో.. మా ఎన్నికల చాటున మరోసారి టాలీవుడ్‌లో చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అన్న పరిస్థితి నెలకొందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా నాగబాబు రంగంలోకి దిగడంతో.. ఇక రాబోయే రెండు రోజుల్లో మా సభ్యులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఈ రెండు ప్యానల్స్ తీవ్రతరం చేసే అవకాశం ఉందని.. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

First published:

Tags: Chiranjeevi, MAA Elections, Manchu Vishnu, Mohan Babu, Prakash Raj

ఉత్తమ కథలు