Chiranjeevi - Rajamouli: రాజ‌మౌళి డైర‌క్ష‌న్‌లో చిరు ఆ ప‌ని చేస్తున్నారా?

Will Chiranjeevi do that in SS Rajamouli direction

Chiranjeevi - Rajamouli: జనవరి 26న 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీజర్‌ విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టీజర్‌ కోసం రాజమౌళి చిరంజీవిని లైన్‌లో పెట్టాడట. ఇంతకీ ఎందుకు అనే వివరాల్లోకి వెళితే..

  • Share this:
    రాజ‌మౌళి డైర‌క్ష‌న్‌లో చిరంజీవి చేస్తే చూడాల‌న్న‌ది ఫ్యాన్స్ కోరిక‌. అస‌లు జ‌క్క‌న్న - చిరు కాంబో కుదిరితే ఎలా ఉంటుందో చూడాల‌న్న‌ది సినీ గోయ‌ర్స్ అంద‌రి మాటా. అంతా కాక‌పోయినా, ఎంతో కొంత ఈ నెలాఖరుకు నెర‌వేరేట‌ట్టే ఉందంటున్నాయి ఫిల్మ్ స‌ర్కిల్స్. రాజ‌మౌళి డైర‌క్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ట్రిపుల్ ఆర్ కోసం చిరంజీవి ప‌ని చేస్తున్నార‌న్న‌ది లేటెస్ట్ బ‌జ్‌. అయితే చిరంజీవి న‌టించే ప‌ని చేయ‌డం లేదు. మాట సాయం చేస్తున్నారంతే! అంటే ఈ నెల 26న ట్రిపుల్ ఆర్ నుంచి ఓ టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఈ టీజ‌ర్‌కి చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నార‌ట‌.

    ట్రిపుల్ ఆర్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రెండు టీజ‌ర్లు వ‌చ్చాయి. వాటిలో మొద‌టిదానికి తార‌క్‌, రెండో దానికి చెర్రీ వాయిస్ ఓవ‌ర్లు ఇచ్చారు. ఇప్పుడు మూడో దానికి మెగాస్టార్ అయితేనే ప‌ర్ఫెక్ట్ అని ఫీల‌వుతోంద‌ట జ‌క్క‌న్న క్యాంప్‌. ఇప్ప‌టికే ఈ విష‌యం గురించి ఒక‌టికి రెండు సార్లు మెగాస్టార్‌తో సంప్ర‌దింపులు కూడా జ‌రిగాయట‌. ట్రిపుల్ ఆర్ విష‌యంలో ఏ చిన్న అప్‌డేట్ వ‌చ్చినా వెంట‌నే ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ కావ‌డం చిరంజీవికి అల‌వాటుగా మారింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ టీజ‌ర్‌కి ఆయ‌నే మాట‌ల‌తో ప్రాణం పోస్తే.. అదీ ఒక‌టి కాదు, రెండు కాదు... బ‌హు భాష‌ల్లో చిరంజీవి వాయిస్ ఉంటే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లోంచే ఆయ‌న చేత వాయిస్ ఓవ‌ర్ ఇప్పించాల‌నే థాట్ వ‌చ్చింద‌ట జ‌క్క‌న్న‌కి.

    ఇప్ప‌టికే చిరు ఓకే చెప్పేశార‌ని, ఆయా లాంగ్వేజెస్‌లో తాను చెప్పాల్సిన డైలాగులను సాయిమాధ‌వ్ బుర్రా నేతృత్వంలో ప్రాక్టీస్ చేస్తున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే తెలుగు నుంచి ప్యాన్ ఇండియా వైపు ఎయిమ్ చేసిన‌ అస‌లు సిస‌లు ప్యాన్ ఇండియా సినిమా ఇదే అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
    Published by:Anil
    First published: