news18-telugu
Updated: May 29, 2019, 5:52 PM IST
వైఎస్ జగన్
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ అఖండ మెజారిటీతో రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. ఇటు ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక మరికొన్ని గంటల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. వై.యస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే తెలుగు ఇండస్ట్రీతో మంచి సంబంధాలే ఉండే. జగన్మోహన్ రెడ్డికి కూడా టాలీవుడ్ నుంచి సత్సంధాలే ఉన్నాయి. మరోవైపు వైయస్ఆర్సీపీలో చాలా మంది సినిమావాళ్లున్నారు.

అలీ, పృథ్వీ
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి,నాగార్జునకు ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు జగన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నాగార్జునకు జగన్ అత్యంత సన్నిహితుడు. పైగా ఎన్నికలకు ముందు కూడా ఆయన్ని వెళ్లి కలిసొచ్చాడు. దీంతో చిరు,నాగార్జున జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.

వైఎస్ జగన్ చిరంజీవి నాగార్జున
మరోవైపు జగన్మోహన్ రెడ్డి అభిమాన నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆహ్వానించినట్టు సమాచారం. మరి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానని ఇప్పటికే స్పష్టం చేయడంతో బాలయ్య..జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారా లేదా అనేది చూడాలి. మరోవైపు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావపోవచ్చు. అన్నయ్య చిరంజీవి హాజరైన తమ్ముడు మాత్రం ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండే అవకాశం ఉంది.

వైఎస్ జగన్, నందమూరి బాలకృష్ణ
రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే మహేష్ బాబు కూడా ఈ వేడుకకు హాజరు కాకపోవచ్చు. ఒకవేళ హాజరైతే తనపై వైసీపీ ముద్ర పడే అవకాశం ఉండటంతో అటెండ్ అయ్యే అవకాశాలు తక్కువే అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్.. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. సొంత అక్క సుహాసిని పోటీ చేసినా కనీసం టీడీపీ తరుపున ప్రచారం కూడా చేయలేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశాలు దాదాపు లేకపోవచ్చు.

జూనియర్ ఎన్టీఆర్, వైఎస్ జగన్, అక్కినేని నాగార్జున
ఇక మంచు ఫ్యామిలీకి రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి మంచి అనుబంధమే కాదు బంధుత్వం కూడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మోహన్ బాబు, మంచు విష్ణు సహా కుటుంబం మొత్తం అటెండ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ ప్రమాణ స్వకారోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు.

జగన్ సమక్షంలో మోహన్ బాబు వైసీపీ తీర్థం
మరోవైపు వైసీపీలో ఉన్న రాజశేఖర్,జీవిత దంపతులతో పాటు ఆలీ,పృథ్వీ సహా పలువురు వైసీపీలో జాయిన్ అయిన సినీ నటులుందరు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేకానికి ఎవరెవరు హాజరవుతారనేది సినీ, రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
May 29, 2019, 5:52 PM IST