తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ కనకాల. ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటూ అంతా ముక్తకంఠంతో చెప్తుంటారు. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగమ్మాయిలు కూడా సిగ్గుపడేలా తెలుగును స్పష్టంగా పలుకుతుంది ఈమె. ప్రతీ ఇంటి అమ్మాయిలా కలిసిపోయింది సుమ. ఈమె మాటలకు పడిపోని వాళ్లంటూ ఉండరు. అటు పర్సనల్.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో తిరుగులేకుండా వెళ్తున్న సుమపై ఇప్పుడు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ఈమె సుమ కనకాల కాదు.. కేవలం సుమ మాత్రమే.. పేరు వెనక కనకాల పక్కకెళ్లిపోతుందని ప్రచారం జరుగుతుంది.
అంటే భర్త రాజీవ్ కనకాలతో విడిపోతుందనే వార్తలు అయితే బాగానే వస్తున్నాయి. అయితే అందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం ఇప్పుడెవరికి అంతు చిక్కడం లేదు. ఈమె విడాకులు తీసుకోబోతుంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. కానీ వాళ్లు స్పందించడం లేదు. ఇప్పుడు స్పందించే పరిస్థితుల్లో కూడా లేరు. ముఖ్యంగా సుమ సంపాదన విషయంలో రాజీవ్ కనకాలకు పడటం లేదని.. ఆయన ఓర్చుకోలేకపోతున్నారని కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి.
కానీ తనకు అలాంటివి సంబంధమే లేదని.. భార్య సంపాదన నుంచి రూపాయి కూడా అడగలేదని.. ఎంత సంపాదిస్తున్నావని ఏ రోజు తాను ప్రశ్నించలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్. కానీ ఇప్పుడు ఈ కారణమే వీళ్లను విడిపోయేలా చేస్తుందని ప్రచారం జోరుగానే జరుగుతుంది. మరోవైపు వీళ్ల కుటుంబంలో వరస విషాదాలు కూడా జరుగుతున్నాయి.
రెండేళ్ల కింద సుమ అత్తగారు.. గతేడాది మామయ్య.. మొన్నటికి మొన్న ఆమె ఆడపడుచు చనిపోయారు. దాంతో సోషల్ మీడియాలో గతంలోలా ఇప్పుడు యాక్టివ్ లేరు. మొత్తానికి వచ్చే గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.. సుమ మాత్రం తన పనులతో తాను బిజీ అయిపోయింది. అన్నట్లు ఈమె చాలా కాలంగా ఒంటరిగానే మరో ఇంట్లో ఉంటుందని సన్నిహితులు చెబుతున్న మాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood