నా లవర్ మోసం చేసింది భయ్యా.. ఆ యాంకర్‌‌పై రవి సెటైర్..?

యాంకర్ రవి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. ఈయన ఎప్పుడూ రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. అలాంటి రవి కొన్ని రోజులుగా తన పని తాను చూసుకుంటున్నాడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 5, 2019, 8:25 PM IST
నా లవర్ మోసం చేసింది భయ్యా.. ఆ యాంకర్‌‌పై రవి సెటైర్..?
యాంకర్ రవి ఫైల్ ఫోటో
  • Share this:
యాంకర్ రవి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. ఈయన ఎప్పుడూ రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. అలాంటి రవి కొన్ని రోజులుగా తన పని తాను చూసుకుంటున్నాడు.. చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత మనోడు ఫామ్‌లోకి వచ్చాడు. ఎందుకో తెలియదు కానీ తాజాగా లోకల్ గ్యాంగ్స్ ప్రోమోలో అదిరిపోయే సెటైర్ ఒకటి వేసాడు. ఈటీవీలో పటాస్ షో చేస్తూనే జీ తెలుగుకు వచ్చాడు రవి. అక్కడ అనసూయ, ప్రదీప్ లాంటి వాళ్ళతో కలిసి లోకల్ గ్యాంగ్స్ షో చేస్తున్నాడు. ఇందులో నాగబాబు కూడా అప్పుడప్పుడూ వస్తుంటాడు. జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ భరత్ ఈ కాన్సెప్ట్ రూపొందించారు.

Will Anchor Ravi sensational satire on his old friend Lasya in Zee Telugu Local Gangs promo pk యాంకర్ రవి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. ఈయన ఎప్పుడూ రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. అలాంటి రవి కొన్ని రోజులుగా తన పని తాను చూసుకుంటున్నాడు.. anchor ravi,anchor ravi facebook,anchor ravi twitter,anchor ravi lasya,anchor ravi srimukhi,anchor ravi local gangs promo,anchor ravi pradeep,anchor ravi anchor srimukhi,anchor ravi lasya affair,anchor ravi movies,anchor ravi show,anchor ravi patas show,anchor ravi srimukhi love story,anchor ravi pradeep show,anchor ravi affairs,telugu cinema,లోకల్ గ్యాంగ్స్,యాంకర్ రవి,యాంకర్ లాస్య రిలేషన్,యాంకర్ రవి శ్రీముఖి,తెలుగు సినిమా
రవి, శ్రీముఖి (Facebook)


జీ తెలుగులో రెండు వారాలుగా వస్తున్న ఈ ప్రోగ్రామ్‌ను ఎలాగైనా సక్సెస్ చేయాలని పట్టుదలతో కనిపిస్తున్నాడు రవి అండ్ గ్యాంగ్. ప్రదీప్ యాంకర్ కావడంతో నవ్వులు కూడా బాగానే పూస్తున్నాయి. ఇక వచ్చే వారం ప్రోమోలో భాగంగా రవి వేసిన ఓ పంచ్ డైలాగ్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది. స్క్రిప్ట్‌లో భాగమో లేదంటే పర్సనల్ ప్రాబ్లమో తెలియదు కానీ రవి మాటలు మాత్రం బాగా ట్రెండ్ అవుతున్నాయి. రాములో రాములా నన్నాగం చేసిందిరో అంటూ వచ్చిన రవిని ప్రదీప్ ఏమైంది అని అడిగితే.. ప్రేమించి మోసం చేసింది భయ్యా అంటూ డైలాగ్ చెప్పాడు రవి. ఏదో ఓ రోజు అది ఫీల్ అవుతుంది.. ఓ ఎదవను పెళ్లి చేసుకున్నానే అని అంటూ సెటైర్ వేసాడు.

ఈయన మామూలుగానే మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ డైలాగ్ మరోలా ట్రెండ్ అవుతుంది. రవి గతంలో శ్రీముఖి, లాస్య లాంటి యాంకర్స్‌తో కలిసి పని చేసాడు. అందులో లాస్యతో ఈయనకు రిలేషన్ బాగానే ఉండేది. అయితే ఉన్నట్లుండి రవిని తిట్టడం.. పెళ్లి చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక శ్రీముఖి కూడా ఈ మధ్యే బిగ్ బాస్‌లో తన లవ్ స్టోరీ చెప్పింది. అందులో హీరో కమ్ విలన్ రవి అంటూ సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టులు కూడా బాగానే వచ్చాయి. దానికితోడు రవితో కలిసి పని చేయడానికి నాన్న పర్మిషన్ కావాలంటూ శ్రీముఖి చెప్పడం కూడా సంచలనమే. ఇవన్నీ ఇలా ఉన్న తరుణంలో తనను మోసం చేసి మరొకర్ని పెళ్లి చేసుకున్నందుకు అది ఏడుస్తుందంటూ స్కిట్‌లో రవి చెప్పినా కూడా బయట జనం మాత్రం మరోలా కనెక్ట్ అవుతున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: December 5, 2019, 8:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading