అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రయాణం.. బ్లాక్ బస్టర్ దర్శకుడితో ప్లాన్..

తెలుగు హీరోలు ఇప్పుడు బాలీవుడ్ పని కూడా పడుతున్నారు. ఇన్నాళ్లూ హిందీ సినిమా అంటే మనకు సంబంధం లేదు.. దానికి ఖాన్స్‌తో పాటు ఇంకా చాలా మంది హీరోలున్నారు.. మనకెందుకు అని ప్రత్యేకంగా పక్కనే ఉండేవాళ్లు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 23, 2019, 4:08 PM IST
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రయాణం.. బ్లాక్ బస్టర్ దర్శకుడితో ప్లాన్..
అల్లు అర్జున్ (Source: Facebook)
  • Share this:
తెలుగు హీరోలు ఇప్పుడు బాలీవుడ్ పని కూడా పడుతున్నారు. ఇన్నాళ్లూ హిందీ సినిమా అంటే మనకు సంబంధం లేదు.. దానికి ఖాన్స్‌తో పాటు ఇంకా చాలా మంది హీరోలున్నారు.. మనకెందుకు అని ప్రత్యేకంగా పక్కనే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. మన సినిమాలే బాలీవుడ్‌లో కుమ్మేస్తున్నాయి. మన సినిమాలు అక్కడ రికార్డులు తిరగరాస్తున్నాయి. ప్రభాస్, చిరంజీవి లాంటి హీరోలు ఇప్పుడు తమ సినిమాలతో హిందీలో కూడా చర్చనీయాంశంగా మారారు. ఇక కేజీయఫ్ సంచలనం కూడా మరిచిపోకూడదు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ ఎంట్రీపై ఆలోచిస్తున్నాడు.
Will Allu Arjun going to Bollywood and he attended Bollywood Director Nikkhil Advani Party pk తెలుగు హీరోలు ఇప్పుడు బాలీవుడ్ పని కూడా పడుతున్నారు. ఇన్నాళ్లూ హిందీ సినిమా అంటే మనకు సంబంధం లేదు.. దానికి ఖాన్స్‌తో పాటు ఇంకా చాలా మంది హీరోలున్నారు.. మనకెందుకు అని ప్రత్యేకంగా పక్కనే ఉండేవాళ్లు. allu arjun,allu arjun twitter,allu arjun facebook,allu arjun instagram,allu arjun bollywood entry,allu arjun nikkhil advani,allu arjun sukumar,allu arjun trivikram ala vaikuntapuramlo,telugu cinema,allu arjun hindi movies,అల్లు అర్జున్,అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ,అల్లు అర్జున్ హిందీ సినిమాలు,తెలుగు సినిమా,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అల వైకుంఠపురములో
అల్లు అర్జున్ (Source: Facebook)

ఇన్నాళ్లు కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన.. ఉత్తరాదికి వెళ్లాలని చూస్తున్నాడు. ఇదే విషయంపై మాట్లాడుతూ.. త‌న‌కు ఔట్ ఆఫ్ ది బాక్స్ ట్రై చేయాల‌ని ఉంద‌ని చెప్పాడు బ‌న్నీ. వీలుంటే క‌చ్చితంగా బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తాన‌ని చెబుతున్నాడు ఈయ‌న‌. పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బ‌న్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదే ఇప్పుడు త‌న హిందీ సినిమాల‌కు ప‌నికొస్తుంద‌ని భావిస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకు వేస్తున్నాడు అల్లు వారబ్బాయి. బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వానీతో బన్నీ మాటామంతి జరిపాడని ప్రచారం జరుగుతుంది.

Will Allu Arjun going to Bollywood and he attended Bollywood Director Nikkhil Advani Party pk తెలుగు హీరోలు ఇప్పుడు బాలీవుడ్ పని కూడా పడుతున్నారు. ఇన్నాళ్లూ హిందీ సినిమా అంటే మనకు సంబంధం లేదు.. దానికి ఖాన్స్‌తో పాటు ఇంకా చాలా మంది హీరోలున్నారు.. మనకెందుకు అని ప్రత్యేకంగా పక్కనే ఉండేవాళ్లు. allu arjun,allu arjun twitter,allu arjun facebook,allu arjun instagram,allu arjun bollywood entry,allu arjun nikkhil advani,allu arjun sukumar,allu arjun trivikram ala vaikuntapuramlo,telugu cinema,allu arjun hindi movies,అల్లు అర్జున్,అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ,అల్లు అర్జున్ హిందీ సినిమాలు,తెలుగు సినిమా,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అల వైకుంఠపురములో
అల్లు అర్జున్ నిఖిల్ అద్వానీ (Source: Facebook)

ఈ మధ్యే విడుదలై సంచలన విజయం సాధించిన బాట్లా హౌజ్ సిినిమాను తెరకెక్కించింది నిఖిల్ అద్వానీనే. ఈయన పార్టీకే బాంబే వెళ్లాడు బన్నీ. అక్కడే చాలా సేపు ఆయనతో మాట్లాడాడని తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ఉందని.. అవకాశం ఉంటే హిందీలో నటించడానికి తనకేం అభ్యంతరం లేదని బన్నీ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంచి కథ వస్తే తనకు అక్కడికి వెళ్లడానికి ఇబ్బందేం లేదని ఇప్పటికే చెప్పాడు బన్నీ. ప్రస్తుతం త్రివిక్ర‌మ్ అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్న బన్నీ.. ఆ తర్వాత సుకుమార్, వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమాలు చేయనున్నాడు. వాటి తర్వాత బాలీవుడ్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు బన్నీ.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు