• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • WILL AKKINENI NAGARJUNA REPLACING NANDAMURI BALA KRISHNA ROLE IN YOUNG HERO NAGA SHOURYA MOVIE MHN

Nandamuri Bala Krishna - Akkineni Nagarjuna: కుర్ర హీరో సినిమా.. బాల‌య్య‌ను నాగార్జున రీప్లేస్ చేస్తాడా?

Nandamuri Bala Krishna - Akkineni Nagarjuna: కుర్ర హీరో సినిమా.. బాల‌య్య‌ను నాగార్జున రీప్లేస్ చేస్తాడా?

Will Akkineni Nagarjuna Replacing Nandamuri Bala Krishna role in young hero Naga Shourya movie

Nandamuri Bala Krishna - Akkineni Nagarjuna: నందమూరి బాలకృష్ణ ఓ యువ హీరో సినిమాలో చేయాల్సిన కీలక పాత్రలో ఇప్పుడు నాగార్జున అక్కినేని నటించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి

  • Share this:
    టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకులైన బాల‌కృష్ణ‌, నాగార్జున మ‌ధ్య పొస‌గ‌డం లేదు. నాగార్జున ఈ విష‌యంపై పెద్ద‌గా రియాక్ట్ కాడు కానీ.. బాల‌కృష్ణ మాత్రం వీలున్న‌ప్పుడ‌ల్లా నాగార్జున‌పై కోపం వ్య‌క్తం చేస్తుంటాడు. స‌రే! వీరి వైరాన్ని ప‌క్క‌న పెడితే.. ఇంత వైరం ఉన్న ఈ సంద‌ర్భంలో నాగార్జున ఓ సినిమా కోసం బాల‌య్య చేయ‌బోయే రోల్‌ను చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలేంటో తెలియ‌డం లేదు కానీ.. వివ‌రాల మేర‌కు, హీరో నాగశౌర్య సినిమాలో నాగార్జున అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.

    సీనియ‌ర్ నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మాణంలో నాగ‌శౌర్య ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇందులో నాగ‌శౌర్య ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఇంత‌కీ నాగ‌శౌర్య పోషించ‌నున్న ఆ ఛాలెంజింగ్ రోల్ ఏంటో తెలుసా! బ‌ధిరుడి పాత్ర‌. ఈ సినిమాలో కీల‌క పాత్ర‌కు ముందు బాల‌కృష్ణ అనుకున్నారు. ఆయ‌నతో సంప్ర‌దింపులు కూడా జ‌రిపారు. అయితే బిజీ షెడ్యూల్ కార‌ణంగా సినిమా చేయ‌లేన‌ని చెప్పేశాడ‌ట‌. ఇప్పుడు ఆ స్థానంలో నాగార్జున‌ను న‌టింప చేయ‌డానికి నిర్మాత‌లు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

    పాత్ర బావుండి.. మంచి రెమ్యున‌రేష‌న్ ఇస్తే కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌డానికి నాగార్జున ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మ‌రి నాగశౌర్య సినిమాలో న‌టించ‌డానికి ఓకే అంటాడో లేదో చూడాలి. ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేముల అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నాడ‌ని టాక్‌. గ‌త ఏడాది నాగ‌శౌర్య‌కు పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. ఎందుకంటే అటు న‌టుడిగా, ఇటు నిర్మాత‌గా నాగ‌శౌర్య‌కు హిట్ లేదు. దీంతో నాగ‌శౌర్య ఆశ‌ల‌న్నీ 2021పైనే ఉన్నాయి. చేస్తున్న నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ఎలాంటి స‌క్సెస్‌ను అందిస్తుంద‌నేది తెలియాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు