Home /News /movies /

WILL ACTRESS TRISHA KRISHANAN TO TIE KNOT IN 2021 YEAR MNJ

Trisha Krishnan: తమిళ్ పొన్న త్రిష 2021లోనైనా పప్పన్నం పెడుతుందా?

త్రిష

త్రిష

తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది బ్యాచ్‌లర్ బాయ్స్, భామలు ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నారు. వీరిలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌లో ఒకరైన త్రిష(Trisha Krishnan) కూడా ఉన్నారు.

    Trisha Krishnan: తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది బ్యాచ్‌లర్ బాయ్స్, భామలు ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నారు. వీరిలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌లో ఒకరైన త్రిష కూడా ఉన్నారు. 37 ఏళ్లు దాటినా వన్నెతరగని అందంతో సౌత్ ఇండియన్ ఆడియన్స్‌ని మంత్రముగ్దులను చేస్తున్న ఈ భామ ఇంకా పెళ్లి పీటలెక్కలేదు. ఇప్పటికే పలుమార్లు ఈ ముదరు భామ పెళ్లి పీటలెక్కబోతోందని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. అంతేకాదు.. అప్పట్లో ప్రముఖ నిర్మాత వరుణ్‌ మణియన్‌‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ పెళ్లి ఊసే ఎత్తలేదు. 2020 మొత్తం కరోనా మహమ్మారితోనే సరిపోయింది. అయినప్పటికీ కొందరు హీరోలు, హీరోయిన్స్.. ప్రేమ పెళ్లిళ్లు, అరేంజ్డ్ పెళ్లిళ్లు చేసుకుని బ్యాచిలర్ లైఫ్‌ టాటా చెప్పేశారు. ఇంకా కొందరు బ్యాచిలర్స్ ఓ ఇంటివాళ్లు అవుతుండటంతో త్రిష మరోసారి వార్తల్లో నిలిచింది.

    పప్పన్నం పెడుతుందా..!?
    2021లో అయినా త్రిష పెళ్లి పీటలెక్కి.. పప్పన్నం పెడుతుందో లేదో అని తమిళ, తెలుగు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి మునుపటిలాగా త్రిషకు సినిమా ఆఫర్స్‌ కూడా రావట్లేదు.. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి లాంటి బడా హీరోల సరసన ఛాన్స్ వచ్చినా చిన్నపాటి విషయాలకే పక్కనెట్టేయడం ఇలా చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు సినిమాలు ఎలాగూ లేవు కదా.. కాస్త గ్యాప్ ఇచ్చి పెళ్లి సంగతి చూడండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా వచ్చే ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలనే యోచనలోనే ఉందని టాక్. అయితే పెద్దలు కుదిర్చిన కుర్రాడిని చేసుకుంటుందా..? లేకుంటే ఆల్రెడీ త్రిష మనసులో ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం తెలియరాలేదు.

    ఇంతకీ నచ్చిన మగాడెవరో..!?
    కాగా.. నిర్మాతతో ఎంగేజ్మెంట్ దగ్గరే ఆగిపోవడంతో హీరో శింబుతో త్రిష పెళ్లి ఖాయమైనట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. గతంలో వీరిద్దరూ ప్రేమాయణాలు నడపడం, చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో అవన్నీ నిజం చేస్తున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. శింబు కూడా చాలా మందితోనే ప్రేమాయణం నడిపాడు.. అయితే ఒకప్పటి తన డ్రీమ్ గర్ల్‌ త్రిషతో మళ్లీ ప్రేమలో పడ్డాడట. వీరి ప్రేమను రెండు కుటుంబాల పెద్దల దాకా తీసుకెళ్లి.. మూడు ముళ్లతో ఒకటి కావాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియరాలేదు. గతంలో సోషల్ మీడియాలో అభిమానులు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ‘నచ్చిన మగాడు దొరికితే లాస్‌వేగాస్‌లోనే పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది. మరి ఆ నచ్చిన మగాడు శింబునేనా..? లేకుంటే మరెవరా..? అనేది తెలియాల్సి ఉంది.
    Published by:Manjula S
    First published:

    Tags: Tollywood, Trisha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు