Wild Dog 1st weekend collections: ‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నాగార్జునకు మళ్లీ నిరాశే..

Wild Dog Collections Photo : Twitter

Wild Dog 1st weekend collections: నాగార్జున (Nagarjuna) ప్రయోగం బెడిసికొట్టింది. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో కొత్త దర్శకుడు అషిషోర్ సోలోమన్‌ తెరకెక్కించిన వైల్డ్ డాగ్ (Wild Dog)చిత్రం ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో చాలా దారుణంగా వెనకబడిపోయింది. ఈ చిత్ర ఏరియా వైజ్ వసూళ్లు మీకోసం..

  • Share this:
కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో కూడా కొత్త కథలను ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు నాగార్జున. తనకు స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా ఒక్కోసారి కథ నచ్చి ప్రయోగాలు చేస్తుంటాడు. అలా ఇప్పుడు చేసిన ప్రయోగం వైల్డ్ డాగ్. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో కొత్త దర్శకుడు అషిషోర్ సోలోమన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ వసూళ్ల విషయంలో మాత్రం చాలా వెనకబడింది. ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత వైల్డ్ డాగ్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. కనీసం 3 కోట్ల షేర్ కూడా వసూలు చేయలేకపోయింది ఈ చిత్రం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాగార్జున సినిమాను పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఏరియా వైజ్ వసూళ్లను ఇప్పుడు చూద్దాం..

నైజాం- 99 లక్షలు
సీడెడ్- 34 లక్షలు
ఉత్తరాంధ్ర- 34 లక్షలు
ఈస్ట్- 17 లక్షలు
వెస్ట్- 13 లక్షలు
గుంటూరు- 18 లక్షలు
కృష్ణా- 19 లక్షలు
నెల్లూరు- 11 లక్షలు

ఏపీ + తెలంగాణ (3 రోజుల టోటల్)- 2.45 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 12 లక్షలు
ఓవర్సీస్- 22 లక్షలు

వరల్డ్ వైడ్ (టోటల్)- 2.79 కోట్లు

‘వైల్డ్ డాగ్’ చిత్రానికి 9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే 10 కోట్ల షేర్ రావాల్సిందే. ఫస్ట్ వీకెండ్ కేవలం 2.79 కోట్ల షేర్ రాబట్టింది. సినిమాలో కమర్షియల్ అంశాలు లేకపోవడంతో ఈ సినిమాను పూర్తిగా దూరం పెట్టారు ప్రేక్షకులు. ఓటిటిలో వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. దాంతో నాగార్జునకు దేవదాస్, ఆఫీసర్, మన్మథుడు 2 తర్వాత మరో ఫ్లాప్ తప్పలేదు.
Published by:Praveen Kumar Vadla
First published: