ప్రేక్షకులకు ఏది కావాలో అది చూపించడం తప్పేకాదు.. యువ నటి

'వైఫ్ ఐ' అనే అడల్ట్ మూవీ లో నటించిన గుంజన్.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ లో "నా ప్రొఫెషన్ నటన.. అందుకోసం నేను ఎక్స్ పోజింగ్ కూడా చేయాల్సి వస్తుందంటూ అదరగొట్టింది.

news18-telugu
Updated: January 4, 2020, 12:31 PM IST
ప్రేక్షకులకు ఏది కావాలో అది చూపించడం తప్పేకాదు.. యువ నటి
Facebook/GunnjanAras
  • Share this:
సాధార‌ణంగా సినిమా అంటే.. ఒక స‌గ‌టు ప్రేక్ష‌కుడికి వినోదాన్ని పంచే మాధ్య‌మం అయి ఉండాలి. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా కాసేపు కాల‌క్షేపం కోసం చూసేదిగా ఉండాలి. అయితే సినిమాలో నిజంగానే క‌థ డిమాండ్ చేస్తే అడ‌ల్ట్ స‌న్నివేశాలు పెట్టొచ్చు. కానీ కొంద‌రు శృంగారంలో క‌ళాత్మ‌క ధోర‌ణి, అశ్లీల ధోర‌ణికి తేడా లేకుండా సినిమాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా టాలీవుడ్ లో వరుసగా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజవుతున్నాయి. టీజర్, ట్రైలర్స్ తోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రాలలో నటించే హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేయాలేగానీ.. నగ్నంగా చేయడానికి కూడా సిద్ధమేనని ప్రకటిస్తున్నారు. అయితే సినిమాల్లో నగ్నంగా నటించిన హీరోయిన్ల జాబితా పెద్దదే. పైగా, వీరు నటించిన చిత్రాలు ఎన్నో వివాదాలకు సైతం దారితీశాయి. అయితే, వీరంతా నగ్నంగా నటించినందుకు ఏనాడు చింతించలేదని.. సహజత్వం కోసం అలాంటి సన్నివేశాలు ఉండాలని, ఇది కూడా ఒక కళేనని, తాము ఏం చేసినా అది తమకు అన్నం పెట్టే పరిశ్రమ కోసమే చేశామని చెప్పడం కొసమెరుపు.

ఇదే తరహాలో తనపై వస్తున్న విమర్శలపై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది యువనటి గుంజన్... 'వైఫ్ ఐ' అనే అడల్ట్ మూవీ లో నటించిన ఈ భామ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ లో "నా ప్రొఫెషన్ నటన.. అందుకోసం నేను ఎక్స్ పోజింగ్ కూడా చేయాల్సి వస్తుంది. దానికి నన్ను విమర్శించే హక్కు ఎవరికి లేదు. రోడ్డు మీద కొంతమంది అమ్మాయిలు వెళ్తే అందులో ఒక్కరు స్కర్ట్ వేసుకుని మిగిలిన వారు అంతా కూడా లంగా ఓణీ వేసుకుంటే జనాలు ఎవరిని ఎక్కువగా చూస్తారు. స్కర్ట్ వేసుకున్న అమ్మాయిలనే చూస్తారు. అందుకే జనాలు ఏదైతే కోరుకుంటున్నారో నేను అదే ఎక్స్ పోజింగ్ చేస్తున్నాను, నటించేందుకు నేను ఎప్పుడు సిగ్గు పడలేదు. సిగ్గు పడాల్సిన అవసరం కూడా లేదు. నాకు అందం ఉంది కనుక నా అందమైన ఫిగర్ ను చూపిస్తున్నాను. అందాన్ని చూపించడంలో తప్పు ఏం లేదనేది నా అభిప్రాయం." అంటూ తన ఉద్దేశాన్ని ఒక ప్రశ్నకు సమాధానం గా చెప్పింది.

అనసూయ హాట్ పిక్స్...
First published: January 4, 2020, 12:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading