• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • WHY THERE IS NO NEW UPDATE FROM KEERTHY SURESH STARRER GOOD LUCK SAKHI MOVIE WHEN WILL IT RELEASE MNJ

Keerthy Suresh: కీర్తి సురేష్ న‌టించిన ఆ సినిమా జాడ ఎక్క‌డ‌

Keerthy Suresh: కీర్తి సురేష్ న‌టించిన ఆ సినిమా జాడ ఎక్క‌డ‌

Keerthy Suresh Photo : Instagram

Keerthy Suresh: కెరీర్ ప్రారంభం నుంచి సెల‌క్టెడ్‌గా సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నారు కీర్తి సురేష్. అయితే మ‌హాన‌టితో కీర్తికి మ‌రింత క్రేజ్ పెరిగింది. ఆ మూవీ ఇచ్చిన ఊపుతో వ‌రుస‌గా లేడి ఓరియెంటెడ్ సినిమాల‌ను చేస్తూ వ‌చ్చారు.

  • Share this:
    Keerthy Suresh: కెరీర్ ప్రారంభం నుంచి సెల‌క్టెడ్‌గా సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నారు కీర్తి సురేష్. అయితే మ‌హాన‌టితో కీర్తికి మ‌రింత క్రేజ్ పెరిగింది. ఆ మూవీ ఇచ్చిన ఊపుతో వ‌రుస‌గా లేడి ఓరియెంటెడ్ సినిమాల‌ను చేస్తూ వ‌చ్చారు. అందులో పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ ల‌క్ స‌ఖి చిత్రాలు ఉన్నాయి. వీటిలో పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓటీటీలో విడుద‌ల అయ్యాయి. అయితే అవేవీ పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోలేదు. ఇక షూటింగ్‌లు ప్రారంభం అయిన కొత్తలో గుడ్ ల‌క్ స‌ఖి షూటింగ్‌ని పూర్తి చేశారు కీర్తి. ఆ స‌మ‌యంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ మూవీ కూడా ఓటీటీలోనే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కీర్తి చెప్పుకొచ్చారు. కానీ థియేట‌ర్లు మ‌ళ్లీ తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌కి ముందు షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలే కాదు.. ఆ త‌రువాత షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ప‌లు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. అంతేకాదు ఇప్పుడు షూటింగ్‌కి జ‌రుపుకునే చిత్రాలు సైతం విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే గుడ్ ల‌క్ టీమ్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది.

    పోస్ట‌ర్, టీజ‌ర్ మిన‌హా ఈ మూవీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ సినిమా ద‌ర్శ‌కుడు గానీ, నిర్మాత‌లు గానీ, కీర్తి గానీ గుడ్ ల‌క్ స‌ఖిపై ఎక్క‌డా మాట్లాడ‌టం లేదు. ఈ మ‌ధ్య‌లో ప‌లు పండ‌గ‌లు వ‌చ్చినా.. గుడ్ ల‌క్ టీమ్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది. ఈ క్ర‌మంలో అస‌లు ఈ మూవీ ఎక్క‌డుంద‌న్న ప్ర‌శ్న కీర్తి అభిమానుల్లో మెదులుతోంది. దీంతో ప‌లువురు ఫ్యాన్స్ కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ టీమ్ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉందో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు. మ‌రి ఈ సినిమా విష‌యంలో ఏం జ‌రుగుతుందో తెలియాల్సి ఉంది.


    కాగా బ్యాడ్ ల‌క్ అని ముద్ర వేసుకున్న ఓ అమ్మాయి.. నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌గా ఎలా ఎదిగింది అన్న క‌థాంశంతో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో కీర్తి సురేష్‌, జ‌గ‌ప‌తి బాబు, ఆది, ర‌మా ప్ర‌భ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జాతీయ అవార్డు గ్ర‌హీత న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ చంద్ర ప‌దిరి, శ్రావ్య వ‌ర్మ నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.
    Published by:Manjula S
    First published: