Kajal Aggarwal : కాజల్ పెళ్లి కోసం సర్జరీ చేయించుకుందా... వైరల్ అవుతోన్న పిక్స్..

Kajal Aggarwal : కాజల్.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో ఈ నెల 30న ముంబైలో వివాహం జరగబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: October 30, 2020, 6:38 AM IST
Kajal Aggarwal : కాజల్ పెళ్లి కోసం సర్జరీ చేయించుకుందా... వైరల్ అవుతోన్న పిక్స్..
కాజల్ అగర్వాల్ Photo : Instagram
  • Share this:
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై దశాబ్దం అవుతోన్న కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. ఓ వైపు కుర్ర హీరోలతో నటిస్తూనే సినీయర్స్‌తో కూడా రొమాన్స్ చేస్తోంది. డైరెక్టర్ తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగు సినిమాలకు పరిచయమైనా... క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ 'చందమామ' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఇక అప్పటినుండి.. వెనుకకు చూసింది లేదు కాజల్. తెలుగువారిని తన అందచందాలతో, ఎవరని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. తెలుగులో దాదాపు అందరీ హీరోలతో నటించింది. అది అలా ఉంటే కాజల్‌ పెళ్లి కుమార్తె కాబోతున్న విషయం తెలిసిందే. తన పెళ్లికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా తీపి కబురు వినిపించింది కాజల్. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో ఈ నెల 30న ముంబైలో తన వివాహం జరగబోతున్నట్లు కాజల్‌ అధికారికంగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో కాజల్ గౌతమ్ ల నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. వివాహనికి ఇంకా ఒకరోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో తాజాగా మెహందీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ గురువారం తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఓ డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అది ఎందంటే పెళ్లి కోసం కాజల్ ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అని అంటున్నారు. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారణం కాజల్ లేటెస్ట్ ఫోటోలలో ఆమె చీక్స్, లిప్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో బహుశా ఆమె మరింత అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఉండోచ్చని అంటున్నారు. మరి నిజంగానే కాజల్ సర్జీరీ చేయించుకుందా లేదా పెళ్లి కళ వల్ల ముఖం అలా వెలిగిపోతుందా అనేది తెలయాల్సీ ఉంది.








View this post on Instagram





🧿 #kajgautkitched 🧿


A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on





ఇక కాజల్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం ‘ముంబై సాగా అనే హిందీ సినిమాలో నటిస్తుండగా.. మరోవైపు కమల్ హాసన్ హీరోగా వస్తోన్న ఇండియన్ 2’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక కాజల్ మరో అవకాశం దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన నటించనుంది. మొదట ఈ పాత్రలో త్రిష నటించాల్సీ ఉండగా.. ఏవో కారణాల వల్ల ఆమె పక్కకు జరగడంతో కాజల్‌కు ఆ అవకాశం దక్కింది. ఈ భామకు మరో ఆఫర్ వచ్చింది. ఓ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లో కాజల్ నటించనుందని సమాచారం. ఆ మధ్య బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఏబీసీ ఛానల్‌తో కలిసి 'క్వాంటికో' అనే సీరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. మూడు సీజన్స్ వరకు ప్రసారం అయినా.. ఆ టీవీ షోలో ఆమె హాట్ హాట్ గా కనిపించి సంచలనం సృష్టించింది కూడా. అలాగే ఆ షోలో ప్రియాంక తన పెర్ఫార్మెన్స్‌తో మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆ టీవీ షోను కాజల్‌తో ఇండియన్ వెర్షన్‌ను నిర్మించడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ సీరీస్ కి ప్రియాంక పాత్రకి కాజల్ అగర్వాల్ ని ఎంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌తో పాటు కాజల్.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న మరో వెబ్‌సిరీస్‌లో కూడా కాజల్ నటిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: October 30, 2020, 6:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading