Bigg Boss 3 | శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ మిస్ అవ్వడానికి ఒక్కటే కారణం?

శ్రీముఖి టైటిల్ విన్నర్ అని భావించారు. హౌస్‌మేట్స్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ, శ్రీముఖి రన్నరప్‌గా సరిపెట్టుకుంది.

news18-telugu
Updated: November 4, 2019, 7:14 PM IST
Bigg Boss 3 | శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ మిస్ అవ్వడానికి ఒక్కటే కారణం?
శ్రీముఖి, నాగార్జున, రాహుల్ సిప్లిగంజ్
  • Share this:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగిసింది. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా, శ్రీముఖి రన్నర్‌గా నిలిచారు. అయితే, ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చాలా రోజుల నుంచి చాలా మంది శ్రీముఖినే విన్నర్ అవుతుందని భావించారు. అటు సోషల్ మీడియా, ఇటు బుల్లితెర ప్రేక్షకులు కూడా శ్రీముఖి విజయం సాధించడం ఖాయమనుకున్నారు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేశాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన వారిలో చాలా మంది శ్రీముఖి మీద చాలా ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో అందరూ బిగ్ బాస్‌కు భయపడితే.. బిగ్ బాస్ మాత్రం శ్రీముఖికి భయపడతాడంటూ సెటైర్లు కూడా వేశారు. హౌస్‌లో అంతా ఆమె చెప్పినట్టే నడుస్తుందని, ఏదైనా టాస్క్‌లు ఆమె పెర్‌ఫార్మెన్స్ బాగోకపోతే.. వాటిని డిలీట్ చేసి మళ్లీ కొత్త టాస్క్‌లు పెట్టాల్సిందిగా బిగ్‌బాస్‌కు సూచిస్తుందంటూ ఆరోపించారు.

అసలు బిగ్ బాస్ హౌస్‌ ప్రారంభం కాకముందే.. టైటిల్ శ్రీముఖికి మాత్రమే ఫిక్స్ అయిందని చర్చల ప్రారంభంలోనే అర్థమైందంటూ... గాయత్రి గుప్తా కూడా ఆరోపించింది. ఇంతమంది శ్రీముఖి టైటిల్ విన్నర్ అని భావించారు. హౌస్‌మేట్స్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ, శ్రీముఖి రన్నరప్‌గా సరిపెట్టుకుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్‌గా నిలుస్తుందని భావించిన శ్రీముఖి విన్నర్ కాకపోవడం వెనుక ఒకే ఒక్క కారణం ఉందని విశ్లేషిస్తున్నారు. ఆ ఒక్క కారణం ఏంటంటే.. శ్రీముఖి ఓవర్ యాక్షన్. సీజన్‌లో శ్రీముఖి చాలా ఓవర్ యాక్షన్ చేసిందని హౌస్‌మేట్స్ ఆరోపించారు. ఆ ఓవర్ యాక్షన్ ఆమె కొంప ముంచిందని.. ఇంతమంది ఆరోపించిన తర్వాత ఆమెను బిగ్ బాస్ విన్నర్‌గా ప్రకటిస్తే... అందరూ ఆరోపించినదే నిజమని ప్రేక్షకులు భావించే అవకాశం ఉంది.



జగన్ డబ్బులిస్తారంటూ భవన నిర్మాణ కార్మికుల వద్ద వసూళ్ల దందా

First published: November 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు