ఈ మధ్యే అక్కినేని కుటుంబంతో కలిసి పార్టీ చేసుకోడానికి సమంతకు అస్సలు టైమ్ దొరకడం లేదు. ఆమె సినిమాలతో బిజీగా ఉందో.. లేదంటే అలా కుదరడం లేదో తెలియదు కానీ ఎందుకో మరి అక్కినేని కుటుంబ వేడుకల్లో మాత్రం సమంత రెగ్యులర్‌గా కనిపించడం లేదు. అదే అభిమానులకు లేనిపోని అనుమానాలు తెప్పిస్తుంది. మొన్నామధ్య ప్రతిష్టాత్మకంగా జరిగిన ఏఎన్నార్ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో సమంత తప్ప అక్కినేని కుటుంబం అంతా హాజరైంది. అప్పుడంటే 96 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండి ఈమె మిస్ అయిందన్నారు. మళ్లీ ఇప్పుడు మరో భారీ వేడుకలో అక్కినేని సమంత మిస్ అయింది.
నాగార్జున అన్నయ్య వెంకట్ తనయుడు ఆదిత్య నిశ్చితార్థం ఈ మధ్యే చెన్నైలోని ఓ తెలుగమ్మాయితో ఘనంగా జరిగింది. దీనికి అక్కినేని కుటుంబంలో అంతా వచ్చారు. అసలక్కడ ఏ వేడుక జరిగినా కూడా అంతా కలిసి చేసుకుంటారు. అన్ని కుటుంబాలు ఒకేచోటికి చేరి పండగ చేసుకోవడం నాగేశ్వరరావు ఉన్నప్పట్నుంచి కూడా ఉన్న అలవాటు. ఏఎన్నార్ లేకపోయినా కూడా నాగార్జున మాత్రం ఇప్పటికీ ఆ ట్రెండ్ కొనసాగిస్తున్నాడు. కుటుంబంలోకి వచ్చిన కొత్త వాళ్లు కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. సమంత కూడా మొదట్లో అన్ని వేడుకలకు హాజరైంది. అయితే ఇప్పుడు ఆదిత్య నిశ్చితార్థానికి మాత్రం రాలేదు.
నాగ చైతన్య, అఖిల్, నాగార్జున, సుమంత్, సుశాంత్ ఇలా ప్రతీ ఒక్కరు వచ్చినా కూడా సమంత రాలేదు. దానికి కారణం ఆమె ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కోసం ఢిల్లీలో షూటింగ్‌లో ఉండటమే.. దాంతో సమంత ఈ వేడుకకు రాలేదు. రావాలని ఎంత ప్రయత్నించినా కూడా షూటింగ్ గ్యాప్ లేకపోవడంతో సమంత ఈ వేడుకకు రావడానికి వీలు పడలేదు. అయితే తన ప్రజెన్స్ లేకపోయినా కూడా కుటుంబానికి మాత్రం చేరువగా ఉండటానికి కొత్త జంటకు భర్త నాగ చైతన్య తరఫునే తన బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చి పంపించింది అక్కినేని కోడలు. ఏదేమైనా కూడా ఈ మధ్య వరసగా అక్కినేని వేడుకల్లో సమంత మిస్ కావడం మాత్రం అభిమానులకు లేనిపోని కలవరాన్ని తెప్పిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood