Rakul Preet Singh: రకుల్ నోరు విప్పితే వాళ్లకు మూడుతుందా..?

Rakul Preet Singh: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతుంది. ఏడాది కింద ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు రకుల్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 15, 2020, 4:19 PM IST
Rakul Preet Singh: రకుల్ నోరు విప్పితే వాళ్లకు మూడుతుందా..?
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
  • Share this:
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతుంది. ఏడాది కింద ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు రకుల్ విషయంలో మరోసారి డ్రగ్స్ ఇష్యూ వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కాస్తా అటు ఇటు తిరిగి ఇప్పుడు డ్రగ్స్ వరకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ ఇండస్ట్రీలలో కూడా డ్రగ్స్ కుదుపులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రియా చక్రవర్తి విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటికి రావడం సంచలనంగా మారుతుంది.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)


సోషల్ మీడియాలో దీనిపై చాలా రకాల వార్తలు వస్తున్నాయి. కొందరు రకుల్ పేరు వచ్చిందని చెప్తుంటే.. మరికొందరు మాత్రం లేదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది రకుల్ ప్రీత్ సింగ్‌కు సపోర్ట్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇదంతా చాలా పెద్ద ముఠా అంటున్నారు. డ్రగ్స్ ఆరోపణలకు సంబంధించి పెద్ద పెద్ద రాజకీయ పార్టీలున్నాయని.. అందుకే అంతా నిశ్శబ్దంగా ఉన్నారని తెలుస్తుంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ విషయంలో మౌనంగానే ఉండాలని ఫిక్స్ అయిపోయింది.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)

లేనిపోని తలనొప్పులు రావడం ఎందుకని.. అందుకే కొన్ని రోజుల పాటు ఏం మాట్లాడకూడదని సన్నిహితులు కూడా సూచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్పందిస్తే అనవసరంగా కొత్త సమస్యలు రావడం ఖాయం అని రకుల్‌కు తెలియంది కాదు. అందుకే తనను టార్గెట్ చేస్తున్నా కూడా కావాలనే కామ్‌గా ఉందని అర్థమైపోతుంది.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)

పైగా ఈమె పేర్లు చెప్పడం మొదలుపెడితే చాలా మంది పెద్ద వాళ్ల పేర్లు కూడా బయటికి వస్తాయని తెలుస్తుంది. అందుకే అవన్నీ పట్టించుకోకుండా సింపుల్‌గా క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. మరి ఈ వివాదం ఇంకా ఎంతదూరం వెళ్తుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 15, 2020, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading