నిహారిక ఎంగేజ్మెంట్‌లో కనపడని బాబాయ్ పవన్ కళ్యాణ్ జాడా..

నిహారిక నిశ్చితార్థం (Niharika Engagement)

నిన్నటి నిన్న మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్ధం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ రాకపోవడం ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

 • Share this:
  నిన్నటి నిన్న మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్ధం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్ ఉపాసన, అల్లు అరవింద్ సహా  మెగా ఫ్యామిలీకి చెందిన దాదాపు అందరు కుటుంబ సభ్యులు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎంత మంది వచ్చిన ఏం లాభం నిహారిక ఎంగేజ్‌మెంట్‌లో  బాబాయి పవన్ కళ్యాణ్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడింది. ఐతే.. పవన్ కళ్యాణ్.. తనకున్న రాజకీయ ఒత్తిడుల కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదా. కావాలనే ఈ కార్యక్రమానికి గైర్హాజరైయ్యాడా అని మెగాభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. స్వామీజీలు పీఠాధిపతులు ఆచరించే చాతర్మాస్య వ్రతం ఆచరిస్తున్నాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదా అని అందరు చెప్పుకుంటున్నారు.అదే అయితే.. తన శిష్యుడు హీరో నితిన్ వివాహానికి హాజరై నూతన వధూవరులును త్రివిక్రమ్‌తో కలిసి ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్.. సొంత అన్న కూతురు నిహారిక  నిశ్చితార్ధానికి హాజరు కాకపోవడం పెద్ద చర్చనీయాంశం అయింది.

  నిహారిక నిశ్చితార్ధ వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ (Instagram/Photos)


  మొత్తంగా పవన్ కళ్యాణ్.. ఈ వేడుకకు రాకపోవడానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అని మెగాభిమానులతో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వేడుకలో మెగాఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు ఈ వేడుకకు హాజరు కాలేదు. మొత్తంగా తన అన్న కూతురు నిహారిక నిశ్చితార్ధానికి పవన్ కళ్యాణ్ రాకపోవడం ఇపుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకు రావడం రాకపోవడం అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. దీన్ని మరి భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు. నిశ్చితార్ధానికి రాకపోయినా.. అన్న కూతురు పై పవన్ కళ్యాణ్ ప్రేమను ఎవరు కాదనలేరు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: