Pawan Kalyan - Krish: పవన్ కళ్యాణ్, క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఆలస్యానికి అదే కారణమా..?

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (Pawan Kalyan Hari Hara Veeramallu)

Pawan Kalyan - Krish: పవన్ హరిహర వీరమల్లు(Pawan Kalyan - Krish) సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ముందు నుంచి నిర్మాత ఏఎం రత్నం చెప్తూనే ఉన్నాడు. అనుకున్నట్లుగానే పవన్ సినిమా సంక్రాంతి 2022కు రాబోతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వేగంగా షూటింగ్స్ పూర్తి చేసే దర్శకులలో క్రిష్ ముందుంటాడు. అనుకుంటే పూరీ జగన్నాథ్ కంటే వేగంగా ఈయన సినిమాలు పూర్తి చేస్తుంటాడు. వైష్ణవ్ తేజ్ రెండో సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసాడు క్రిష్. బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాను కేవలం 79 రోజుల్లోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా ఇప్పటికే 40 శాతానికి పైగానే పూర్తయింది. క్రిష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. 100 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నాడు నిర్మాత ఏఎం రత్నం. పవన్ కెరీర్‌లో కూడా హైయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఇదే. పైగా ఈయన చేస్తున్న తొలి హిస్టారికల్ సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో అధికంగానే ఉండబోతున్నాయి. 16వ శతాబ్ధపు కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో బందిపోటుగా నటిస్తున్నాడు పవన్.

మరోవైపు బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ హరి హర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. కోహినూర్ డైమండ్ కథతో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ముందు నుంచి నిర్మాత చెప్తూనే ఉన్నాడు. అనుకున్నట్లుగానే పవన్ సినిమా సంక్రాంతి 2022కు రాబోతుంది. అయితే హరిహర వీరమల్లు కాకుండా సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్‌తో రాబోతున్నాడు. ఉన్నట్లుండి క్రిష్ సినిమాను పక్కనబెట్టి.. ఆ సినిమాను ముందుకు తీసుకురావడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు.
pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan hari hara veeramallu movie,pawan kalyan hari hara veeramallu movie shooting delay,pawan kalyan hari hara veeramallu movie kirsh delay,pawan kalyan hari hara veeramallu movie release date,telugu cinema,పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు,పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్,పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు విడుదల ఆలస్యం
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (Pawan Kalyan Hari Hara Veeramallu)

దీని వెనక చాలా చిన్న కారణం ఉంది. క్రిష్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలానే ఉన్నాయి.. దానికితోడు విజువల్ ఎఫెక్ట్స్‌తో పని ఉంది. ఇవన్నీ ఏం లేని సాగర్ సినిమాను ముందు పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యాడు. హరి హర వీరమల్లు లాంటి భారీ సినిమాను హడావిడిగా పూర్తి చేయడం పవన్‌కు యిష్టం లేదు. అందుకే కాస్త ఆలస్యమైనా పర్లేదని ముందు అయ్యప్పునుమ్ రీమేక్ పూర్తి చేస్తున్నాడు. 2022 సమ్మర్ నాటికి హరిహర వీరమల్లు కూడా సిద్ధం కానుంది. నిధి అగర్వాల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: