క్రికెటర్లకు గడ్డం దేనికి...టీమ్ ఇండియాకు బాలీవుడ్ సీనియర్ నటుడు చురకలు

రానున్న.. వన్డే ప్రపంచకప్‌కు భారత్ తరపున ఆడబోయే ఆటగాళ్ల పేర్లను ఇటీవల  బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటుడు రిషి కపూర్..అసలు మన క్రికెటర్లకు గడ్డం దేనికని ప్రశ్నిస్తూ..గడ్డంతో ఉన్నవాళ్లంతా సామ్సన్‌లేనా..అంటూ చురకలంటించారు.

news18-telugu
Updated: April 17, 2019, 4:48 PM IST
క్రికెటర్లకు గడ్డం దేనికి...టీమ్ ఇండియాకు బాలీవుడ్ సీనియర్ నటుడు చురకలు
టీమ్ ఇండియా..Photo: twitter.com/BCCI
news18-telugu
Updated: April 17, 2019, 4:48 PM IST
రానున్న.. వన్డే ప్రపంచకప్‌కు భారత్ తరపున ఆడబోయే ఆటగాళ్ల పేర్లను ఇటీవల  బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన మరుసటి రోజే బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ ట్వీటర్‌లో ఓ పోస్ట్ చేస్తూ..'అసలు మన టీమిండియా క్రికెటర్లకు గడ్డం దేనికి? అని ప్రశ్నిస్తూ.. అంటే మన క్రికెటర్లందరూ  సామ్సన్ లేనా.. (ఇజ్రాయెల్‌ వీరుడు సామ్సన్‌‌ను ఉద్దేశిస్తూ...ప్రాచీన ఇజ్రాయెలీ వీరుల్లో సామ్సన్‌ ఒకరు.. ఆయన బలం మొత్తం.. అతని వెంట్రుకల్లోనే ఉంటుందని ప్రతీతి)  మన క్రికెటర్లు.. గడ్డం లేకుంటే మరింత అందంగా కనిపిస్తారు. ఈ విషయం..నేను జస్ట్‌  గమనించి.. మీతో పంచుకుంటున్నానాను..’ అని పేర్కొన్నారు.  బాలీవుడ్ నటుడు రిషి కపూర్.. కొంత కాలంగా.. అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అతను కొన్ని నెలల క్రితం మెరుగైన చికిత్స కొరకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వెళ్లిన సంగతి తెలిసిందే.

టీమ్ ఇండియా..Photo: BCCI
టీమ్ ఇండియా..Photo: twitter.com/BCCI


అదీ అలా ఉంటే..  టీమిండియా సంబంధించిన విషయాల్లో.. అప్పుడప్పుడూ రిషికపూర్.. సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటారు. అయితే అనారోగ్యం కారణంగా.. ఈ మధ్య సోషల్ మీడియాలో అంత యాక్టీవ్‌గా లేడు.. చాలా కాలం తర్వాత అతని నుండి ఓ ట్వీట్‌ రావడంతో కపూర్ అభిమానులు..తమ అభిమాన నటుడు ఆరోగ్యంగానే ఉన్నాడన్నా.. ఆనందంలో మునిగితేలుతున్నారు.


First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...