నందమూరి బాలయ్య అభిమానులకు షాక్ ఇచ్చే న్యూస్..

Nandamuri Bala Krishna | కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా 105వ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన న్యూలుక్‌ రిలీజ్ అయింది. అందులో బాలయ్య డిఫరెంట్ లుక్‌లో అదరగొడుతున్నాడు.

news18-telugu
Updated: August 22, 2019, 4:46 PM IST
నందమూరి బాలయ్య అభిమానులకు షాక్ ఇచ్చే న్యూస్..
బాలయ్య న్యూ లుక్ (Source: Twitter)
  • Share this:
నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరి నుంచి తప్పుకొంటున్నాడా? తన లేటెస్ట్ సినిమా సంక్రాతికి రిలీజ్ కావడం అనుమానమేనా? ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాకపోవచ్చని తెలుస్తోంది. అసలు బాలయ్య అంటేనే సంక్రాంతి హీరో. ఆయన నటించిన సినిమాల్లో 17 సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయ్యాయి. అందులో బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. 2018లో జైసింహా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. 2019లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథనాయకుడు కూడా సంక్రాంతి కానుకగానే వచ్చింది. అయితే, 2020లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న తన 105వ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దామని మొదట భావించారు. అయితే, తాజాగా మూవీ యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్‌లోనే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అంటే సంక్రాంతికి రాకపోవడం అభిమానులకు కొంత నిరుత్సాహపరిచే అంశమే అయినా, సంక్రాంతి కంటే ముందే సినిమా రావడం వారికి ఆనందాన్నిచ్చే అంశం.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు